హద్దులు దాటేసిన పూజా హెగ్డే... బికినీ లాంటి డ్రెస్‌లో మతిపోయేలా గ్లామర్ షో!

గత కొంతకాలంగా సరైన హిట్ లేక పూజా హెగ్డే కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ బుట్టబొమ్మ కెరీర్ ఏమాత్రం సాఫీగా సాగడం లేదు. ప్రస్తుతం చేతిలో ఒకటి ఆరా సినిమాలు తప్పించి ఏం లేవు.. ఈ క్రమంలో పూజాహెగ్డే గ్లామర్ షోకు తెరదీశారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

మోడలింగ్ నుంచి సినీరంగంలో అడుగుపెట్టారు పూజా హెగ్డే .. స్టార్ హీరోయిన్ కావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ వచ్చింది. అయితే పోయినచోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో శ్రమించి తన లక్ష్యాన్ని అందుకున్నారు పూజా హెగ్డే. డీజే, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్ధల కొండ గణేష్, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా నిలిచారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేశారు.

Pooja Hegde Turns Up Glamour Quotient with Viral Mirror Selfies

అయితే రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు డిజాస్టర్ కావడంతో పాటు కొన్ని సినిమాల నుంచి ఆమెను తప్పించడంతో పూజాహెగ్డే కెరీర్‌ తారుమారైంది. తెలుగులోనే కాదు హిందీ, తమిళంలోనూ పూజా హెగ్డే సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు ఆమె ఆశలన్నీ జన నాయగన్, హిందీ మూవీ హాయ్ జవానీతో ఇష్క్ హోనా హైపైనే ఉన్నాయి. ఇవి కాకుండా ప్రస్తుతం కాంచన 4, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న డీక్యూ 41 సినిమాలలో పూజా హెగ్డే నటిస్తున్నారు.

తమిళంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న జన నాయగన్ మూవీ వివాదాల్లో చిక్కుకోవడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. దళపతి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. జన నాయగన్ హిట్ అయితే తన కెరీర్‌ కూడా ప్లస్‌గా మారుతుందని బుట్టబొమ్మ భావించగా ఆమె అంచనాలు తలకింద్రులయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయం సాధించడంతో త్వరలోనే జన నాయగన్ విడుదల అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి పలువురితో పూజా హెగ్డే ఎఫైర్స్ నడిపినట్లుగా పలుమార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌తో పాటు బిగ్‌‌బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమాయణం సాగించారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో రోహన్ మెహ్రాతో పూజ డేటింగ్‌లో ఉందని బీటౌన్ కోడై కూస్తోంది. పూజా- రోహన్‌లు గత కొద్దికాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా చక్కర్లు కొట్టడం, ఒకే కారులో కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పూజా హెగ్డే తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు పూజా హెగ్డే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. బికినీ లాంటి డ్రెస్‌లో నిక్కర్‌పై ఉన్న బుట్టబొమ్మ తన అందాలను ఆరబోస్తున్నారు. మిర్రర్ ముందు సెల్ఫీలు దిగుతూ రెచ్చగొడుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా పూజ నుంచి ఇలాంటి ఫోటోలు రాలేదు. అయితే కెరీర్ కోసమే ఆమె గ్లామర్ డోస్ పెంచారని విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X