For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్ విప్పేసిన ఫొటోతో షాకిచ్చిన పూజా హెగ్డే: కరోనా టైంలో బ్రా లేకుండా.. వామ్మో ఇలా చూపించిందేంటి!

  |

  ఆకట్టుకునే అందం.. అంతకు మించిన యాక్టింగ్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. చాలా కాలం క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. తద్వారా కెరీర్ ఆరంభంలోనే బాలీవుడ్ ఆఫర్లను సైతం అందుకుంది. ఇలా కొంత కాలంగా ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో పూజా హెగ్డే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ విప్పేసి కనిపించింది. దీంతో ఇది చూసిన వారంతా షాక్‌ అవుతున్నారు. ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. తెలుగు గోపికమ్మ

  అలా మొదలైన కెరీర్.. తెలుగు గోపికమ్మ

  మహారాష్ట్రకు చెందిన పూజా హెగ్డే.. చదువు పూర్తయిన వెంటనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ సమయంలోనే తమిళంలో వచ్చిన ‘మూగమూడి' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే తెలుగులో ‘ముకుంద', ‘ఒక లైలా కోసం' అనే సినిమాలను చేసింది. ఇవి పెద్దగా సక్సెస్ కాకున్నా.. గోపికమ్మగా ఆమె అందరి హృదయాలను కొల్లగొట్టేసిందనే చెప్పాలి.

  బడా ఆఫర్లు అందుకుని.. బాలీవుడ్‌లోనూ

  బడా ఆఫర్లు అందుకుని.. బాలీవుడ్‌లోనూ

  తెలుగు రెండు సినిమాలు చేసినా హిట్‌ను అందుకోలేకపోయింది పూజా హెగ్డే. ఇలాంటి సమయంలోనే హృతిక్ నటించిన ‘మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఆమెకు విజయాన్ని అందించలేదు. కానీ, వరుసగా ఆఫర్లను మాత్రం దక్కించుకుందామె. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించి మెప్పించిందీ ముంబై బ్యూటీ.

  వరుస విజయాలతో పూజా హెగ్డే దూకుడు

  వరుస విజయాలతో పూజా హెగ్డే దూకుడు

  కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డ పూజా హెగ్డే.. ఈ మధ్య ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ' నుంచి వరుసగా ‘మహర్షి', ‘గద్దలకొండ గణేష్', ‘అల.. వైకుంఠపురములో' వంటి విజయాలను అందుకుని సత్తా చాటింది. తద్వారా ఇంకొన్ని ఆఫర్లను దక్కిచుకుంది. అదే సమయంలో రెమ్యూనరేషన్ పెంచేసింది.

  ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న చిత్రాలు ఇవే

  ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న చిత్రాలు ఇవే

  అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీనితో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్' షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ‘ఆచార్య'తో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

  కరోనా బారిన పడ్డ బుట్టబొమ్మ... బన్నీతో

  కరోనా బారిన పడ్డ బుట్టబొమ్మ... బన్నీతో

  కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చుతోంది. మరీ ముఖ్యంగా ఈ సారి సినీ ప్రముఖులపై ఇది ప్రభావం చూపుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఉంది. ఇటీవలే ఆమె పాజిటివ్‌గా తేలింది. ఆ వెంటనే అల్లు అర్జున్‌ కూడా దీని బారిన పడ్డాడు. దీంతో ఆమె ఫన్నీగా పోస్ట్ పెట్టి అందరి దృష్టిలో పడింది.

  అందులో యమ యాక్టివ్.. అన్నీ చెబుతూ

  అందులో యమ యాక్టివ్.. అన్నీ చెబుతూ

  సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన వ్యక్తిగత, సినీ కెరీర్ విషయాలను, విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందాచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా ఎనలేని క్రేజ్‌ను ఫాలోయింగ్‌ను అందుకుంటోంది.

  Prabhas 24 కి అంతా సిద్ధం, Radhe Shyam పై Prabhas స్పెషల్ కేర్!!
  టాప్ విప్పేసిన ఫొటోతో షాకిచ్చిన పూజా హెగ్డే

  టాప్ విప్పేసిన ఫొటోతో షాకిచ్చిన పూజా హెగ్డే

  తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ జాకెట్ విప్పేసి కనిపించింది. అయితే, ఈ పిక్‌లో ఆమె బ్రా ధరించలేదు. దీంతో ఈ ఫొటోపై విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ‘వేసవి కాలం బ్రా ఎందుకులే అనుకున్నావా' అని కొందరు అనగా.. ‘కరోనా టైంలో ఇలాంటవి అవసరమా' అంటూ మరికొందరు రిప్లైలు చేస్తున్నారు.

  English summary
  Pooja Hegde is an Indian film actress who appears predominantly in Telugu and Hindi films. She was crowned as the second runner-up at the Miss Universe India 2010 competition. She made her debut in Tamil film Mysskin's Mugamoodi. She made her Telugu film debut alongside Naga Chaitanya in Oka Laila Kosam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X