ఎన్టీఆర్ అలా ఎలా చేస్తాడో అర్థమే కాదు.. రెండు టేకుల్లో ఫినిష్!
అరవింద సమేత చిత్రం అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అరవింద సమేత చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల వేగం పెంచింది. అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి పూజ హెగ్డే మాట్లాడిన వీడియో బైట్ ని విడుదల చేశారు.

త్రివిక్రమ్ దర్శత్వంలో
త్రివిక్రమ్ వంటి దర్శకుడి చిత్రంలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని పూజ హెగ్డే తేలిపోయింది. నిర్మాతపై, ఇతర చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించింది. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడని పూజ పేర్కొంది.

అర్థమే కాదు
ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పెద్ద స్టార్ అయినప్పటికీ సింపుల్ గా ఉంటారు. ఎన్టీఆర్ నటించే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం రెండు టేకుల్లోనే షాట్ ఫినిష్ చేస్తాడు అంటూ ఎన్టీఆర్ ని ప్రశంసలతో ముంచెత్తింది.

ప్రచారానికి దూరం
పూజ హెగ్డే ఇటీవల జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా తాను రావడం కుదరలేదని పూజ హెగ్డే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజగా అందుతున్న వార్తల ప్రకారం పూజా హెగ్డే ఈ చిత్ర పోర్మోషన్ కార్యక్రమాలు కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది. బాలీవుడ్ లో నటిస్తున్న సినిమాతో బిజీగా ఉండడంతో ఆమె అరవింద సమేత ప్రచారానికి పూర్తిగా దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

క్రేజీ హీరోయిన్‌గా
డీజే చిత్రం తరువాత పూజ హెగ్డే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బడాస్టార్ హీరోల చిత్రాలన్నీ ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. అరవింద సమేత విడుదలకు సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ సరసన మహర్షి చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











