Pooja Hegde : ఫ్యాన్స్‌కి బుట్టబొమ్మ దీపావళీ ట్రీట్ .. వైట్ డ్రెస్‌లో అందాల బ్లాస్ట్!
ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను అందుకున్నారు కన్నడ కస్తూరి పూజా హెగ్డే. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. హృతిక్‌తో మొదలుపెట్టి దళపతి విజయ్ వరకు ఆల్‌మోస్ట్ అగ్ర కథనాయకులతో ఆడిపాడే అవకాశాన్ని దక్కించుకుని పూజా హెగ్డే దూసుకెళ్లారు. తాజాగా దీపావళి పర్వదినం సందర్భంగా ఆమె అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.
1990 అక్టోబర్ 13న సాంప్రదాయ కన్నడ కుటుంబంలో ముంబైలో జన్మించారు పూజా హెగ్డే. ఇంట్లో అంతా ఉన్నత విద్యావంతులు కావడంతో ఆమె కూడా టాపర్‌గా నిలిచారు. అయితే 19 ఏళ్ల వయసులో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మొదటి రౌండ్‌లోనే తప్పుకున్నారు. కానీ ఎక్కడా డిప్రెషన్‌లోకి వెళ్లకుండా ఆ మరుసటి ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కాంటెస్ట్‌లో రన్నరప్‌గా కిరీటం అందుకున్నారు. ఈ విజయంతో మోడలింగ్‌లో అడుగుపెట్టిన పూజ.. ఫేమస్ బ్రాండ్స్‌కు అండార్స్ చేశారు, దేశంలోని ప్రముఖ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా నిలిచారు.

సినీ నేపథ్యం లేనప్పటికీ అనూహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పూజాహెగ్డే .. తమిళంలో ముగామూడీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఒక లైలా కోసం మూవీతో తెలుగు వారిని పలకరించిన ఆమె చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. వరుణ్ తేజ్‌తో ముకుందలో నటించిన పూజా హెగ్డేకు ఆ వెంటనే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన మొహంజదారోలో నటించే అవకాశం దక్కించుకుని ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఇక నాటి నుంచి ఆమె వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు.
తెలుగుతో పాటు తమిళ్‌లోనూ బ్లాక్ బస్టర్స్‌లో నటించి లక్కీ లేడీగా నిలిచారు. సౌత్‌లో దక్కిన స్టార్ డమ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా మంచి విజయాలను అందుకుంది. కానీ ఎందుకో తెలియదు కానీ గత కొంతకాలంగా పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా అలరించలేదు.
సూపర్‌స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారంలో తొలుత ఆమెనే హీరోయిన్‌గా నిర్ణయించగా.. అనివార్య కారణాలతో పూజా హెగ్డే తప్పుకున్నారని ఫిలింనగర్ టాక్. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా, తమిళ్‌లో సూర్య 44వ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ సినీ జీవితంలో ఆఖరి చిత్రంగా భావిస్తున్న దళపతి 69లో పూజ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారును రెచ్చగొడుతుంటారు. తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో కనువిందు చేశారు పూజా హెగ్డే. నడుము, ఎద అందాలను ఆరబోస్తూ దీపావళికి ముందే పండగ తీసుకొచ్చారు. వైరల్ అవుతోన్న బుట్టబొమ్మ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











