షాకింగ్ రోల్ లో పూజా హెగ్డే.. హారర్ సీక్వెల్ కోసం ఇలా మారబోతుందా?

ప్రెజెంట్ దక్షిణాది సినిమా దగ్గర చాలా మంది టాప్ హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ అందరిలో కూడా ఒక దశాబ్దం దాటి ఓ హీరోయిన్ సర్వైవ్ అయ్యింది అంటే ఆమెలో మేటర్ ఉందనే అర్ధం చేసుకోవాలి. కాగా ఇలాంటి టాప్ హీరోయిన్స్ లో ఇపుడు మళ్ళీ హాట్ టాపిక్ గా వినిపిస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది డస్కీ బ్యూటీ పూజా హెగ్డే అని చెప్పాలి.

కాగా పూజా హెగ్డే తెలుగులో ఒక డీసెంట్ డెబ్యూ ఇచ్చింది. అక్కడ నుంచి వరుస ఆఫర్స్ అందుకోవడం ఒక టైం లో ప్లాప్ సినిమాలు ఉన్న హీరోలకి ఈమెతో సినిమా చేస్తే తప్ప మరో దిక్కు లేదు అనే రేంజ్ లో పూజా హెగ్డే మారిపోయింది. కాగా ఇలా కొన్నేళ్ళపాటుగా తెలుగు సినిమాలో హవా కనబరిచిన పూజా హెగ్డే నెమ్మదిగా ప్లాప్ లు ఇవ్వడంతో ఆమెపై గోల్డెన్ లెగ్ అనే కామెంట్ నుంచి ఐరన్ లెగ్ అనే కామెంట్స్ చేయడానికి కూడా పెద్దగా సమయం తీసుకోలేదు.

pooja hegde will be seen in a shocking for lawrence movie

ఐతే ఇక్కడ నుంచి తెలుగు సినిమాకి దాదాపు దూరం కూడా అయ్యిపోయింది. ఇక ఇదిలా ఉండగా పూజా హెగ్డే హీరోయిన్ గా సౌత్ సినిమాలు పోగొట్టుకున్నట్టే అని అనుకున్న సమయంలో మళ్ళీ వరుసగా తనకి ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి. కాగా మెయిన్ గా ఛాన్స్ లు అన్నీ మళ్ళీ తమిళ్ సినిమా నుంచే ఆమెకి రావడం గమనార్హం కాగా కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకునే సమయంలో మళ్ళీ ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో పూజా హెగ్డే బిజీగా మారిపోయింది.

ఇక ఇదిలా ఉండగా పూజా హెగ్డే అందుకున్న ఈ చిత్రాల్లో రాఘవ లారెన్స్ తో చేయనున్న భారీ హారర్ థ్రిల్లర్ సినిమా కూడా ఒకటి. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుండగా తన కెరీర్లో ఇపుడు వరకు చేయని ఒక కొత్త తరహా పాత్రని పూజా చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. కాగా దర్శకుడు లారెన్స్ కోసం అందరికీ తెలిసిందే.

తన సినిమాల్లో దివ్యాంగులు విషయంలో కొంచెం అవగాహన ఇచ్చే విధంగా పలు ఎమోషనల్ సీన్స్ ని పెడుతూ ఉంటాడు. మరి ఇలా పూజా హెగ్డే కూడా ఈ చిత్రంలో ఒక దివ్యంగురాలి పాత్ర పోషించనున్నట్టుగా తెలుస్తుంది. కాగా లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం పూజా హెగ్డే ఊహించని విధంగా ఒక చెవిటి, మూగ లోపాలు ఉండే అమాయకమైన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి నటిగా ఇది ఆమెకి ఛాలెంజింగ్ రోల్ అని కూడా చెప్పవచ్చు. మరి పూజా హెడ్జ్ నిజంగానే ఈ రోల్ లో కనిపిస్తుందో లేదో అనేది వేచి చూడాలి. ఇక తమిళ్ లో ఈ సినిమా మాత్రమే కాకుండా స్టార్ హీరో విజయ్ దళపతితో సినిమా జన నాయగన్ అలాగే సూర్యతో రెట్రో అనే గట్టి సినిమాలే తాను చేస్తుంది.

More from Filmibeat

Read more about: pooja hegde jana nayagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X