Pooja Hegde: 100 కోట్ల హార్రర్ మూవీలో పూజా హెగ్డే.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

Pooja Hegde Horror Movie: గత కొద్దికాలంగా హార్రర్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. స్టార్స్ తో సంబంధం లేకుండా ఈ జోనర్ మూవీస్ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కొద్దిగా నవ్వించి, కాస్తా భయపెడితే చాలు.. కాస్ట్ తో సంబంధం లేకుండా ఆ కాసుల వర్షం కురిపిస్తారు ఆడియెన్స్. అలాగే.. ఈ మూవీస్ లో నటించడానికి స్టార్ హీరోయిన్స్ సైతం క్యూ కడుతున్నారు. ఈ దెయ్యాల సినిమాలపై హాట్ బ్యూటీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే రాశిఖన్నా, తమన్నా, హన్సిక, త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ ఈ జోనర్ లో నటించి హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. వారి అడుగు జాడల్లోనే మరో గ్లామర్ బ్యూటీ అడుగులు వేయబోతోంది. ఏ ఏదోలే చిన్న బడ్జెట్ మూవీ అనుకుంటే.. మీరు పప్పులో కాలువేసినట్టే .. ఆ హర్రర్ మూవీని ఏకంగా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందట. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఈ హార్రర్ మూవీలో నటించే ముద్దుగుమ్మ ఎవరో ? మీరు కూడా ఓ లూక్కేయండి.

Pooja Hegde will play the female lead in Raghava Lawrence Kanchana 4

ఈ భారీ బడ్జెట్ హర్రర్ మూవీలో నటించే బ్యూటీ ఎవరో కాదు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హేగ్డే. ఇంతకీ ఆ సినిమా ఎంటో అని ఆలోచిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదండీ.. సూపర్ హిట్ మూవీ'కాంచన' కు సీక్వెల్. ఈ మూవీ సీక్వెల్ లో హీరోయిన్ గా పూజ హెడ్జే ను సంప్రదించునట్టు టాక్,. దీంతో కాంచన 4 లో బాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతుందనే ప్రచారం మొదలైంది.

ఒక వేళ ఈ క్రేజీ హార్రర్ మూవీకి బుట్టబొమ్మ అధికారికంగా ఒకే చెప్పలేదంట. ఆమె ఖచ్చితంగా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని టాక్. ఇదెలా ఉంటే..ఈ మూవీకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించగా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. అని ఒకే అయితే.. ఈ భారీ బడ్జెట్ హర్రర్ మూవీకి సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా.. హర్రర్ మూవీస్ స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ 'హంటర్'అనే మూవీని తెరకెక్కించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అయితే తొలుత కాంచన 4లో సౌత్ ఇండియన్ సార్ట్ హీరోయిన్ నయనతారను హీరోయిన్ గా తీసుకుందామని భావించారంట. కానీ, కొన్ని కారణాలతో ఆ బ్యూటీని పక్కన పెట్టి.. ఈ బుట్టబొమ్మ పూజా హెగ్డేకి అవకాశం కల్పించబోతున్నారట.

Pooja Hegde will play the female lead in Raghava Lawrence Kanchana 4

ఇక కాంచన సిరీస్ విషయానికి వస్తే.. ఈ సిరీస్ 'ముని'తొలి సినిమా 2007లో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. దాంతో దానికి సీక్వెల్ గా 2011లో 'కాంచన'మూవీ వచ్చింది. ఈ మూవీ ఇటు తెలుగు, అటు తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా 2015లో వచ్చిన 'గంగా - కాంచన 3 అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి భయపెట్టాడానికి కాంచన 4తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ అండ్ టీం.

ఇక బాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే విషయానికి వస్తే.. ఈ అమ్మడు రాధే శ్యామ్, ఆచార్య,బీస్ట్, కిసీ కా భాయ్ కిసీకీ జాన్​ భారీ బడ్జెట్ మూవీలో నటించిన ఆ సినిమాలు డిజాస్టర్లు గా నిలిచాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు మందగించాయి. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో
షాహిద్ కపూర్ 'దేవా'తో పాటు సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ కాంబో సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్ త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరీ ఈ మూవీ అయినా హిట్ అయి.. బుట్టబొమ్మ పూజ హెగ్డే కెరీర్ దారిలో పడాలని ఫ్యాన్ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: raghava lawrence pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X