ఆ పని చేస్తూ ఉండగా.. మొత్తం తడిసిపోయింది.. హీటెక్కిస్తున్న పూజా హెగ్డే

ప్రపంచమంతా కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకుని ఉంది. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా విస్తరిస్తోన్న వాటిలో పది స్థానాల్లోపై ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకూ మానవాళి మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మన దేశంలోనూ దాదాపు 60 రోజులుగా లాక్ డౌన్‌ను కొనసాగిస్తూనే ఉన్నాము. ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు.

అందరూ ఇంటి పట్టునే..

అందరూ ఇంటి పట్టునే..

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. స్టార్ సెలెబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారు. అయితే ఖాళీ సమయాన్ని సెలెబ్రిటీలు ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నారు. అందులో పూజా హెగ్డే మరింత తెలివిగా వ్యవహరిస్తోంది.

వంటింట్లో చిట్కాలు..

వంటింట్లో చిట్కాలు..

క్షణ కాలం తీరిక లేకుండా బిజిబిజీగా గడిపే పూజా ప్రస్తుతం.. లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. సరదాగా ఫ్యామిలీతో గడిపేస్తోంది. వంటింట్లో దూరి కొత్త కొత్త వంటకాలను చేసేస్తోంది. అంతేకాకుండా గిటార్ కూడా వాయించడం నేర్చుకుంటోంది.

తండ్రికి స్పెషల్ గిఫ్ట్..

తండ్రికి స్పెషల్ గిఫ్ట్..

తండ్రి కోసం కేక్‌ను తయారు చేసింది. పుట్టిన రోజు సందర్భంగా అర్దరాత్రి సర్ ప్రైజ్ చేస్తూ తాను తయారు చేసిన కేక్‌ను కట్ చేయించింది. అంతేకాకుండా అన్నయ్యలతో సేవలు చేయించుకుంటూ రాజభోగాలు అనుభవిస్తోంది. ఒకరు తలకు మసాజ్ చేయగా..మరొకరు కాళ్లు నొక్కుతున్నారు ఇలా పూజా హెగ్డే ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

Recommended Video

Prabhas20 Title And First Look In May ! Movie Makers Over Fans Trolls
వర్కౌట్లతో బిజీ..

వర్కౌట్లతో బిజీ..

పూజా హెగ్డే తాజాగా వర్కౌట్లు చేసి బాగా అలిసిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ మొత్తం తడిసిపోయానని చెప్పుకొచ్చింది. వర్కౌట్లు చేసి చేసి మొత్తం స్నానం చేసిన దానిలా తడిసిపోయానని తెలిపింది. ఇక ఆ సమయంలో పూజా లుక్స్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X