పూజాహెగ్డేకు తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్టుతో కన్నీరుమున్నీరు

ప్రాణాంతకమైన కరోనావైరస్ అందర్నీ విషాదానికి గురి చేస్తున్నది. కోవిడ్ కాటుతో సన్నిహితులు, స్నేహితులు మరణిస్తున్న నేపథ్యంలో ఎవరైనా తట్టుకోలేని, జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే విషాదంలో మునిగిపోయింది. తనకు ఎదురైన విషాద సంఘటన గురించి చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

నా జీవితానికి స్పూర్తి అంటూ భావోద్వేగం

నా జీవితానికి స్పూర్తి అంటూ భావోద్వేగం

ఇన్స్‌టాగ్రామ్‌లో భావోద్వేగమైన పోస్టు పెట్టి ఎమోషనల్ అవుతూ.. నా జీవితంలో స్పూర్తిని నింపిన నా టీచర్ జెస్సికా దారువాలా ఇకలేరు. ముంబైలో నా స్కూలింగ్ సమయంలో ఎన్నో విషయాలు చెప్పి నాకు ఇన్సిపిరేషన్‌గా నిలిచారు. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా ఏళ్లుగా మా రిలేషన్ కొనసాగుతున్నది. నా జీవితంలో కీలక పాత్రను పోషించారు అని తన పోస్టులో పేర్కొన్నారు.

పూజా హెగ్డే ఎమోషనల్‌గా లేఖ

పూజా హెగ్డే ఎమోషనల్‌గా లేఖ

నా ఫేవరేట్ టీచర్ జెస్పికా దారావాలా మరణంతో గుండె పగిలినంత పనైంది. మానిక్‌జీ కాపర్ స్కూల్‌లో చదవి ఉంటే ఆమె గొప్పతనం ఏమిటో తెలిసే అదృష్టం దక్కేది. విద్యావనంలో గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. నా జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె చూపించిన చొరవ, ధైర్యం, స్పూర్తి నా గుండెల్లో నిండిపోయాయి. నాకు కొత్త బాటను చూపించాయి అని పూజా హెగ్డే తన పోస్టులో పేర్కొన్నారు.

నా లైఫ్‌ను అద్బుతంగా తీర్చి దిద్దిన వ్యక్తి

నా లైఫ్‌ను అద్బుతంగా తీర్చి దిద్దిన వ్యక్తి

బంగారం లాంటి వ్యక్తులు మన జీవితంలో టీచర్లుగా రావడం అరుదుగా సంభవిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి నా జీవితంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తుంటాను. కేవలం జాగ్రఫీ సబ్జెక్ట్‌ను చెప్పడమే కాకుండా నా జీవితాన్ని అద్బుతంగా మలిచారు అంటూ పూజా హెగ్డే ఎమోషనల్ అయ్యారు.

ఈ లోకాన్ని వీడటం బాధగా ఉందంటూ

ఈ లోకాన్ని వీడటం బాధగా ఉందంటూ

నా మాదిరిగా ఎంతో మందికి అద్బుతమైన జీవితాన్ని ప్రసాదించారు. అలాంటి మీరు ఈ లోకాన్ని త్వరగా వీడటం చాలా బాధగా ఉంది. ఇలాంటి సమయంలో మీ ఆత్మ శాంతించాలి. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని పూజా హెగ్డే తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

Prabhas 24 కి అంతా సిద్ధం, Radhe Shyam పై Prabhas స్పెషల్ కేర్!!
బాలీవుడ్, టాలీవడ్‌, కోలీవుడ్‌లో పూజా హెగ్డే

బాలీవుడ్, టాలీవడ్‌, కోలీవుడ్‌లో పూజా హెగ్డే

పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రతోపాటు మహేష్, కొరటాల శివ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో మిస్కిన్ దర్శకత్వంలో ముగమూడి, అలాగే ఇళయదళపతి విజయ్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X