ఖరీదైన ఇంటి కోసం పూజా హెగ్డే ప్రయత్నాలు.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే క్రేజ్ ఇప్పట్లో తగ్గించేలా కనిపించడం లేదు. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వరుస అవకాశాలను అందుకుంటూ బాక్సాఫీస్ హిట్స్ కూడా సాలీడ్ గా అందుకుంటోంది. ఒక సినిమా పోయినా వెంటనే మరో సినిమాతో సక్సెస్ అందుకుంటోంది. ఇక ప్రతిసారి ముంబై నుంచి హైదరాబాద్ కి రావాలి అంటే కష్టం అవుతోందని అమ్మడు సొంత ఇంటిని కట్టుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Recommended Video

Samantha Fans Demand Apologize From Pooja Hegde
అప్పటి నుంచి స్పీడ్ తగ్గడం లేదు

అప్పటి నుంచి స్పీడ్ తగ్గడం లేదు

ముకుందా సినిమాతో సింఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తరువాత కెరీర్ ని సెట్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది పడింది. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో సక్సెస్ అందుకుందో అప్పటి నుంచి కూడా ఆమె స్పీడ్ తగ్గడం లేదు. వరుసగా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

రెమ్యునరేషన్ కూడా పెంచింది

రెమ్యునరేషన్ కూడా పెంచింది

స్టార్ హీరోలు కొత్త సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు అంటే ప్రస్తుతం ఫస్ట్ ఆప్షన్ పూజా హగ్డేనే అని చెప్పవచ్చు. రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచింది. ఆల.. వైకుంఠపురములో హిట్ కావడంతో ఆమె కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దానికి తోడు ఇతర యాడ్స్ ద్వారా కూడా ఆమె ఆదాయం ఇంకా ఎక్కువయ్యింది.

సొంత ఇంటి కోసం..

సొంత ఇంటి కోసం..

ఇక ఫైనల్ గా పూజా రెండు చేతుల సంపాదనను ఒక ఇంటి కోసం ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యిందట. హైదరాబాద్ లోనే ఫిల్మ్ నగర్ కు దగ్గరగా ఉండేలా ఒక మంచి కాస్ట్లీ ఇళ్లు కోసం వెతుకుతున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఒక పాత ఇంటిని తీసుకొని అమ్మడు తనకు నచ్చినట్లు మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ ఇంటి కొసమే బుట్టబొమ్మ మళ్ళీ అదనంగా కోట్లల్లో ఖర్చు చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

ప్రభాస్ తో బిజీగా..

ప్రభాస్ తో బిజీగా..

నెక్స్ట్ ఈ బ్యుటి ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక తరువాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రానుంది. అఖిల్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X