బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ పూజా.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా!
నటి పూజా రామచంద్రన్ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. వీడియో జాకీగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత కాలంలో నటిగా మారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో కూడా మంచి పేరు తెచ్చుకుంది.. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేసే ఈ భామ తాజాగా బికినీలో ఉన్న ఫోటో షేర్ చేసి తన ఫాలోవర్స్ కి హాట్ ట్రీట్ ఇచ్చింది.

నటన మీద ఆసక్తితో
బెంగళూరులో జన్మించిన పూజా రామచంద్రన్ తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో అనేక ప్రాంతాల్లో నివసించవలసి వచ్చింది. నటన మీద ఆసక్తి ఉన్న ఈ భామ ఎలా ఆ అవకాశాలు అందుకోవాలో తెలియక ముందు ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా తన జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారి అనేక సినిమాల్లో కనిపించింది కూడా.

బిగ్ బాస్ సీజన్ 2లో
ఇక ఈ భామకు తెలుగులో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు చాలానే ఉన్నా బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంటర్ కావడం అనేది ఈమె క్రేజ్ మరింత పెంచేలా చేసింది. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో నటిగా తన జీవితం ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత అనేక తెలుగు తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది.

స్వామిరారాతో ఎంట్రీ
ముఖ్యంగా తెలుగులో స్వామిరారా సినిమాతో ఈ భామ కు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత అడవి కాచిన వెన్నెల, దోచేయ్, త్రిపుర, దళం, సిద్ధార్థ, మరల తెలుపనా ప్రియా, ఇంతలో ఎన్నెన్ని వింతలో, దేవిశ్రీప్రసాద్, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ, ఎంత మంచి వాడవురా, పవర్ ప్లే లాంటి సినిమాలలో ఈ భామ కనిపించింది.

ప్రేమ పెళ్లి - విడాకులు
అయితే తనతోపాటు వీజేగా పనిచేస్తున్న క్రైగ్ అనే వ్యక్తిని 2010లో పెళ్లాడి ఏడేళ్ళ సుదీర్ఘ వివాహ జీవితం అనంతరం వారిద్దరికీ వీరు అభిప్రాయ భేదాలు రావడంతో 2017లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె జాన్ కొక్కెన్ అనే ఒక నటుడిని ప్రేమించి వివాహమాడింది. ఏప్రిల్ 15 2019లో వీరిద్దరికీ వివాహం జరిగింది.

లోపలి దిగుతూ
అయితే ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు వార్తల్లో నిలవాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే హాట్ ఫోటోలు షేర్ చేసే పనిలో పడింది. అందులో భాగంగానే తన భర్త తీసిన ఒక ఫోటోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. బ్లూ కలర్ బికినీలో అప్పుడే స్విమ్మింగ్ పూల్ లోకి దిగుతున్న ఫోజులో ఉన్న ఈ భామ హాట్ నెస్ అందరినీ మత్తెక్కించేలా చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫోటో చూసేయండి.


Click it and Unblock the Notifications











