బిగ్ బాస్ బ్యూటీ పూజ రామచంద్రన్ అరాచకం.. స్విమ్మింగ్ పూల్ పక్కనే భర్తతో అలా..!
బిగ్ బాస్ బ్యూటీగా పూజ రామచంద్రన్ మంచి ఇమేజ్ తెచ్చుకుంది. అంతకు ముందు నటిగా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో నటించింది. నటిగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. తెలుగులో అయితే లవ్ ఫెయిల్యూర్ సినిమాతో అందరినీ మెప్పించింది. ఇక బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ అందరినీ ఆకట్టుకుంది. స్ట్రాంగ్ లేడీగా పూజా రామచంద్రన్ బిగ్ బాస్ తెలుగు మీద ముద్ర వేసింది. ఇక ఆమె తన భర్తతో కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు.

నటిగా పలు భాషల్లో..
పూజా రామచంద్రన్ నటిగా పలు భాషల్లో నటించింది. అయితే అంతకు ముందే ఆమె చిన్నతనంలోనే కొన్ని యాడ్స్‌లోనూ నటించింది. ఇప్పటికీ ఆమె కొన్ని ప్రకటనల్లో కనిపిస్తుంటుంది. రియాలిటీ షోలతో బిజీగా కనిపిస్తుంది. కానీ ఆమెకు గుర్తింపు మాత్రం సినిమాలతోనే వచ్చింది. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హంగామా చేస్తున్నది.

అందాల పోటీల్లో సత్తా చాటి
ఇక పూజా రామచంద్రన్ సినీ రంగంలోకి రావడానికి మోడలింగ్ కలిసి వచ్చింది. అందాల పోటీల్లో ఆమె విజేతగానూ నిలిచింది. మిస్ కోయంబత్తూర్‌గా పూజా రామచంద్రన్ గెలిచింది. ఆ తరువాత ఆమెకు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఆమె దక్షిణాదిన మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది.

బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
బిగ్ బాస్ రెండో సీజన్‌లో పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె దూకుడుతనం కాస్త పాజిటివిటినీ, నెగెటివిటీని తీసుకొచ్చింది. మగాళ్లకు ధీటుగా టాస్కులు ఆడింది. కానీ కౌశల్ మీద అనవసరంగా నోరు పారేసుకోవడం, ఫైర్ అవ్వడం లాంటివి చేయడంతో వెంటనే ఎలిమినేట్ అయింది. దాంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు.

పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ
పూజా రామచంద్రన్ మొదటి వివాహాం అంతగా కలిసి రాలేదు. అయితే రెండో సారి నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహాం చేసుకుంది. ఇతగాడు ఆర్య హీరోగా వచ్చిన సార్పట్ట సినిమాలో విలన్‌గా నటించి ఫేమస్ అయ్యాడు. ఇక ఈ ఇద్దరూ నెట్టింట్లో ఎంతగా ఎంజాయ్ చేస్తుంటారో కనిపిస్తుంది. అడ్వంచర్లు, నేచర్ అంటూ ఈ ఇద్దరూ లైఫ్‌ను ఆస్వాదిస్తూ కనిపిస్తారు.
హాట్ ఫోటోలతో హంగామా
పూజ, జాన్ కొక్కెన్ ఇద్దరు కూడా స్విమ్మింగ్, బీచులు అంటూ తిరుగుతుంటారు. ఇక పూజ బికినీలో కనిపిస్తుంటుంది. ఇతగాడేమో అర్థనగ్నంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ ఫోటోనే షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టి వచ్చినట్టున్నారు. ఇక తన భర్త మీద పడుకుని పూజ అలా సేదతీరుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆయన హృదయం నాకు సురక్షిత ప్రదేశం అంటూ
పూజా రాంచంద్రన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసి భర్తపై ప్రేమను కురిపించింది. జాన్ కేవలం నా భర్తే కాదు. ఆయన హృదయం నాకు నివాసం. నేను విశ్రాంతి పొందే ప్రదేశం. నా హృదయానికి, నాకు చాలా సురక్షితమైన ప్రదేశం అంటూ భావోద్వేగంగా ఆమె స్పందించింది. ఆమె పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. మీరుద్దరు బ్యూటీఫుల్ జంట. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించు అని అన్నారు.


Click it and Unblock the Notifications











