మందుతో విందు... పసందైన పూజ వంటకం
ఓ రోజు టాలీవుడ్ లో కనిపిస్తే మరోక రొజు బాలీవుడ్ లో కనిపిస్తూ బిజీగా ఉంటోంది కన్నడ కస్తూరి పూజా హెగ్డే. వీటన్నింటి మధ్యా కాస్త టైమ్ దొరికితే చాలు కుటుంబంతో సమయం గడిపేస్తున్న పూజా ఇప్పుడు వారి కోసం వండి వార్చేస్తోందట. అయితే పనిలో పనిగా తన బ్రాండ్స్ కు ప్రమోషన్ చేసేస్తోంది.
ఈ మధ్య కాస్త సమయం చిక్కితే చాలు వంట గదిలో ప్రయోగాలు చేసేస్తున్న పూజా హెగ్డే, ఆ వీడియోలను షోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకూ వినోదం పంచుతోంది. అయితే ఈసారి కాస్త కొత్తగా మందుతో విందు వడ్డించేస్తోంది అమ్మడు. అదీ మరెవరికో కాదు. స్వంయగా తండ్రి ఓ ప్రముఖ విస్కీ బ్రాండ్ తో పసందైన డ్రింక్ చేసి ఇచ్చిందట.

తండ్రి కోసం ఓ ఆల్కాహాల్ బ్రాండ్ తో టామరిండ్ హైబాల్ అనే ఓ రకం పానీయం చేసిందట పూజ. ఆ ఫొటోలను తన అకౌంట్ లో పోస్ట్ కూడా చేసింది. స్టెప్ బై స్టెప్ ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో కూడా వివరించింది. అయితే, ఇందుకోసం తాను ఉపయోగించిన ఆ ఆల్కాహాల్ బ్రాండ్ ను కూడా పక్కనే పెట్టుకోవడంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలిసిపోతోంది. అమ్మడు సదరు బ్రాండ్ ను గట్టిగానే ప్రమోట్ చేస్తోందని వినిపిస్తోంది.
అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలో బాటిల్ కనిపించడంతో పాటూ, సదరు బ్రాండ్ పేజ్ ను కూడా పూజా తన పోస్ట్ కు ట్యాగ్ చేయడంతో ఇదంతా ప్రమోషన్ లో భాగమేనని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











