100 కుటుంబాలకు సహాయం అందిస్తున్న పూజా హెగ్డే.. గ్రేట్ వర్క్!
టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పూజా హెగ్డే రోజురోజుకు తన హోదాను అమాంతంగా పెంచేసుకుంటోంది. ఆమెకు వస్తున్న ఆఫర్స్ కూడా అలా ఉన్నాయి. డీజే సినిమా నుంచి బ్యూటీ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతొంది. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో సినిమా అనంతరం ఆమె స్థాయి పాన్ ఇండియాకు వచ్చేసింది.
అయితే పూజా హెగ్డే ఇటీవల ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోవిడ్ కష్టకాలంలో జనాల అవస్థలు చూడలేక కొంతమంది సినీ తారలు వారికి తోచినంత సహాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత వరకు ఆర్థికంగా మెడికల్ గా కూడా హెల్ప్ అవుతున్నారు. అదే తరహాలో పూజా హెగ్డే కూడా పేద కుటుంబాల కోసం ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఒకేసారి 100కుటుంబాల కోసం నెలకు సరిపడా రేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. కుదిరితే మరికొందరికి కూడా సహాయం చేయాలని తన టీమ్ తో ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. నెల రోజుల పాటు వంద కుటుంబాలు ఆకలికి ఇబ్బంది పడకుండా అవసరమైన సరుకులను ఇవ్వడానికి ఒక ప్యాకెట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ 65వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో చేసిన రాదేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











