చేతిలో మందు గ్లాస్.. పబ్‌లో హీరోయిన్ల రచ్చ.. శ్రద్దా దాస్-పూనమ్ హల్చల్
ఒకప్పుడు టాలీవుడ్‌లో పూనమ్ భజ్వా, శ్రద్దా దాస్‌లు ఇద్దరూ కూడా ఓ ఊపు ఊపేశారు. గ్లామర్ టచ్ ఇస్తూ ఇద్దరూ కూడా రెచ్చిపోయారు. అయితే పూనమ్ భజ్వాకు గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలు కూడా వచ్చాయి. ఇక శ్రద్దా దాస్ అందాలకు వెండితెర మొత్తం వేడెక్కింది. కానీ ఈ ఇద్దరికి ఇప్పుడు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు.

సోషల్ మీడియాలో రచ్చ..
మొదటి సినిమా, పరుగు వంటి చిత్రాలతో పూనమ్ భజ్వా బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఇక శ్రద్దా దాస్ నటించిన చిత్రాలు అంతగా క్లిక్ కాకపోయినా ఆమె అందాలు మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌ను తెచ్చుకున్నారు.

అలాంటి రూమర్లు..
ఈ ఇద్దరి మీద గతేడాది రూమర్లు తెగ చక్కర్లు కొట్టాయి.ఈ ఇద్దరూ కూడా బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో అడుగుపెట్టనున్నారని వార్తలు వచ్చాయి. శ్రద్దా దాస్ మీద అయితే మూడో సీజన్ నుంచి అలాంటి గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అవేవీ ఇంత వరకు నిజం కాలేదు.

ప్రియుడిని పరిచయం చేసింది..
కోలీవుడ్‌లో తన అంద చెందాలతో పూనమ్ భజ్వా మంచి గుర్తింపును తెచ్చుకుంది. పూనమ్ అందాలకు కోలీవుడ్ మొత్తం ఫిదా అయింది. అక్కడ పూనమ్‌కు స్టార్ స్టేటస్ ఉంది. అలాంటి పూనమ్ గతేడాది తన ప్రియుడిని పరిచయం చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేస్తూ తన పార్ట్నర్‌ను పరిచయం చేసింది.

తాజాగా అలా..
తాజాగా పూనమ్ భజ్వా, శ్రద్దా దాస్ ఇద్దరూ కూడా ఒకే గూటికి చేరారు. పబ్‌లో ఈ ఇద్దరూ కలిసి రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో పూనమ్ భజ్వా తన చేతిలో మందు గ్లాసు పట్టుకుని కనిపించింది. ఇక శ్రద్దా కపూర్ తన అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసింది. మొత్తానికి ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











