బికినీతో బీచ్‌లో పూనమ్ బజ్వా షాకింగ్ ఫొటోలు: సముద్రపు ఒడ్డున హీట్ పెంచే అందాల విందు
సినీ ప్రపంచంలో అందం, అభినయంతో మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఎందుకంటే తమ అందచందాలతో ఎంత అలరించినా కొందరికీ మాత్రం సినీ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రావట్లేదనే చెప్పాలి. అయితే అలాంటి వారికి సినిమాలతో పెద్దగా పాపులారిటీ దక్కకపోయిన ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తెగ అట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా ఒకరు. 38 ఏళ్ల వయసులోనూ ఘాటు అందాలతో ఊహించని విధంగా హాట్ షో చేస్తోంది. ఆమె తాజాగా ఫొటోలపై లుక్కేస్తే..
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..:ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. ఆమె ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టింది.

ర్యాంప్ షోలో:స్టన్నింగ్ బ్యూటి మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలో హైదరాబాద్ లో ఒక ర్యాంప్ కోసం వచ్చింది. ఈ ర్యాంప్ వాక్ లో ఆమెను చూసిన మొదటి సినిమా దర్శకుడు తన సినిమాలో నటించమని కోరాడు. దీంతో అప్పుడు స్కూల్ అయిపోయి కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది పూనమ్ బజ్వా.
ఆమె స్థాయిలో:హీరో నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. అయితే తర్వాతి కాలంలో మంచి సబ్జెక్ట్ ఉన్న కథలు సెలెక్ట్ చేసుకున్న ఈ భామకు బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాలు వచ్చాయి. దీంతో ఆమె గ్లామర్, నటనకు ఉన్నంత స్థాయిలో పాపులారిటీ దక్కకుండా పోయింది.

ఏ ఒక్కటి కూడా:స్టన్నింగ్ బ్యూటి పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమాల్లో బాస్ ఒకటి. ఈ సినిమాలో కింగ్ నాగార్జునతో జత కట్టింది పూనమ్ బజ్వా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. దీంతోపాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించిన పూనమ్ బజ్వాకు ఏ సినిమా కూడా అనుకున్నంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి.

ఇక్కడ ఇలా.. అక్కడ అలా:ఇలా వరుస అపజయాలతో ఈ పూనమ్ స్టార్ డమ్ అయితే ఒక్కసారిగా తగ్గి పోయింది. తర్వాత అల్లు అర్జున్ పరుగు వంటి కొన్ని పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. కానీ అంతగా క్లిక్ కాలేదు. అయితే తెలుగు సంగతి ఎలా ఉన్న తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో హాట్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ సుందరి.

ఓవైపు కూల్.. మరోవైపు హీట్:ఇక తెలుగు సినిమాలతో పెద్దగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు సిద్ధమైంది ఈ 38 ఏళ్ల పూనమ్ బజ్వా. నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటి తాజాగా బీచ్ లో బ్లాక్ కలర్ బికినీలో అందాలను చాప తెరలా ఆరబోసింది. ఓ వైపు సముద్రపు అలలు కూల్ గా ఉంటే మరోవైపు తన ఎద, థైస్ అందాలతో హీట్ పెంచింది ఈ భామ. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











