మొత్తం కనిపించేలా పూనమ్ బజ్వా సెల్ఫీలు.. 37 ఏళ్ల వయసులోనూ ఘాటు పోజులు!
సినీ ప్రపంచంలో అందం, అభినయంతో మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఎందుకంటే తమ అందచందాలతో ఎంత అలరించినా కొందరికీ మాత్రం సినీ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రావట్లేదనే చెప్పాలి. అయితే అలాంటి వారికి సినిమాలతో పెద్దగా పాపులారిటీ దక్కకపోయిన వారి గ్లామర్ షోతో మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ భామ పూనమ్ బజ్వా ఒకరు. 'మొదటి సినిమా'తోనే ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు తెరకు చాలా దూరంగా ఉంది. కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే తన హాట్ ఫొటోలతో నిత్యం టచ్ లోనే ఉంటుంది. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది ఈ బ్యూటి.

పూనమ్ ను చూసి..
పూనమ్ బజ్వా ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టింది. హైదరాబాద్ లో ఒక ర్యాంప్ కోసం వచ్చిన 'మొదటి సినిమా' దర్శకుడు పూనమ్ ని చూసి తన సినిమాలో నటించమని కోరాడు.

పూనమ్ ను చూసి..
'మొదటి సినిమా' మూవీ డైరెక్టర్ కూచిపూడి వెంకట్ సినిమాల్లో నటించమని కోరడంతో అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది పూనమ్ బజ్వా. అయితే పూనమ్ కు మొదట బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం మొదట తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ఉంది.

ఊహించని విధంగా..
'మొదటి సినిమా'తో తెలుగుు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పూనమ్ బజ్వా తప్పకుండా మంచి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటుందని అంతా భావించారు. ఎందుకంటే మోడలింగ్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ప్రముఖ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ మాత్రం మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో మిస్టేక్ చేసింది. ఆ తరహాలో ఆలోచించి ఓకే చేసిన కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి.

ఒక్కసారిగా అలా..
పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమాలలో ఒకటి బాస్. ఈ సినిమాలో కింగ్ నాగార్జునతో జత కట్టింది పూనమ్ బజ్వా. అయితే ఈ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో పూనమ్ అంచనాలు తలకిందులు అయ్యాయి. వీటితో పాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించింది. కానీ అందులో ఏ సినిమా కూడా ఆమెకు అనుకున్నంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి. వరుస అపజయాలతో ఈ పూనమ్ స్టార్ డమ్ అయితే ఒక్కసారిగా తగ్గి పోయింది.

పాత్ర ఓకే.. ఛాన్సులు మాత్రం..
ఇక ముద్దుగుమ్మ పూనమ్ బాజ్వా పలు పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పరుగు సినిమాలో పూనమ్ ఒక కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. హీరోయిన్ సోదరిగా ఆమె నటించిన విధానం అప్పట్లో మంచి గుర్తింపు అయితే అందించింది. కానీ ఆ సినిమా ద్వారా అవకాశాలు మాత్రం పెద్దగా అందిపుచ్చుకోలేకపోయింది.

బాయ్‌ఫ్రెండ్‌తో..
గ్లామరస్ బ్యూటి పూనమ్ బజ్వా చివరిసారిగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో లోకేశ్వరి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ పూనమ్. అయితే ఈ సినిమా కూడా పూనమ్ బజ్వాకు కెరీర్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. కానీ, పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా వెల్లడించింది.
లేటు వయసలో.. ఘాటు సొగసులు...
నిత్యం సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలతో అందరినీ ఆశ్చర్యానికి కలగజేస్తోంది. తాజాగా పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ వీడియో షేర్ చేసింది. ఇందులో లాంగ్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న పూనమ్ బజ్వా వివిధ భంగిమల్లో పోజులిచ్చింది. ఆ పోజులలో ఆమె తన ఎద, షోల్డర్ అందాలను ఘాటుగా ప్రదర్శించింది. సెల్ఫీ వీడియోగా తీసుకున్న దీంట్లో క్లీవేజ్ అందాలు ఫోకస్ అయ్యేలా పోజులిచ్చింది. 37వ వయసులో కూడా ఇలాంటి అందమైంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











