రాజకీయ నేత 15 కోట్లు ఆఫర్.. నోరు మూయించాలని బెదిరింపులు, సుశాంత్‌లా చావను.. పూనమ్ కౌర్

టాలీవుడ్‌లో గురూజీ అని ముద్దుగా పిలచుకొనే ప్రముఖ దర్శకుడిపై హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్లతో దండయాత్ర చేస్తున్న విషయం సంచలనం రేపుతుంది. సుశాంత్ సింగ్ సూసైడ్ నేపథ్యంలో ఎలాంటి ఎలాంటి దారుణాలు చోటుచేసుకొంటున్నాయనే భయాల మధ్య ఈ ట్వీట్ల వివాదం అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నది. తనకు జరిగిన అన్యాయంపైనే పోరాటం అని చెప్పిన పూనమ్ కౌర్ తాజాగా ఓ ప్రముఖ వెబ్‌సైట్‌‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

సుశాంత్‌లా డిప్రెషన్‌తో చనిపోను..

సుశాంత్‌లా డిప్రెషన్‌తో చనిపోను..

టాలీవుడ్‌లో నాకు జరిగిన అన్యాయంపై మాట్లాడటం కొత్తకాదు. దాదాపు రెండేండ్లుగా ఈ విషయంపై నా పోరాటం కొనసాగిస్తున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన వారి వల్ల నేను డిప్రెషన్‌కు గురికాదలచుకోలేదు. నేను సుశాంత్‌లా డిప్రెషన్‌తో చనిపోను. నా జీవితంలో నిప్పులు పోసిన ఆ దర్శకుడిని ఎవరూ గౌరవించకూడదు. నేను ఎంత బాధపడ్డానో.. ఆయన కూడా అంతే బాధను అనుభవించాలి. నేను చావకుండా ఉండాలంటే ఇలాంటి ట్వీట్లు చేయాల్సిందే అని పూనమ్ చెప్పారు.

నా జీవితాన్ని నాశనం చేశాడు

నా జీవితాన్ని నాశనం చేశాడు

ఆ డైరెక్టర్ చేసిన పని వల్ల నా కెరీర్, నా వ్యక్తిగత జీవితం సర్వనాశనం అయింది. ఆ సమయంలో నేను చావు బతుకుల్లో ఉంటే డైరెక్టర్‌ను సహాయం ఆర్థించాను. కానీ ఆయన పట్టించుకోలేదు. సహాయం చేయకపోగా, నా సంతోషాన్ని, మనశాంతిని, నా పేరు, నా అవకాశాలను దెబ్బ తీశాడు. నా జీవితంలో ఏమీ మిగలకుండా చేశాడు. అప్పటి నుంచి నిద్రలేని రాత్రులెన్నో గడిపాను అని పూనమ్ చెప్పారు.

చాలా మంది హీరోయిన్ల జీవితాలు కూడా నాశనం

చాలా మంది హీరోయిన్ల జీవితాలు కూడా నాశనం

టాలీవుడ్‌లో ఆయనను గురూజీ అని పిలుస్తారు. అలా పిలిపించుకొనే అర్హత కూడా ఆయనకు లేదు. చాలా మంది హీరోయిన్ల జీవితాలను నాశనం చేశాడు. తన చేష్టలు, తన పలుకుబడితో అందర్నీ తొక్కాలని చూశాడు. అలానే నా జీవితంలో ఏమీ మిగలకుండా చేశాడు. అలాంటి వ్యక్తిని ఎలా వదిలిపెట్టమంటారు అని పూనమ్ అన్నారు.

రాజకీయ నేతలతో 15 కోట్ల ఆఫర్లు

రాజకీయ నేతలతో 15 కోట్ల ఆఫర్లు

నా జీవితాన్ని నాశనం చేసిన డైరెక్టర్‌ గురించి ఫిర్యాదు చేయడానికి ఓ రాజకీయ నేతను కలిశాను. ఆయనను ఈ డైరెక్టర్ ప్రభావితం చేశాడు. దాంతో ఆయన నా తరఫున మాట్లాడానికి రాలేదు. ఆ డైరెక్టర్‌పై ఏమీ మాట్లాడకుండా ఉండటానికి చాలా మంది రాజకీయ నేతలు నాకు ఫోన్ చేశారు. సుమారు 15 కోట్ల రూపాయలను ఆఫర్ ఇచ్చి నా నోరు మూయించాలని ప్రయత్నించారు అని పూనమ్ కౌర్ సంచలన విషయాలు బయటపెట్టారు.

Recommended Video

Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
మా అసోసియేషన్, హీరోయిన్లు సపోర్ట్ చేయలేదు

మా అసోసియేషన్, హీరోయిన్లు సపోర్ట్ చేయలేదు

నా సమస్యను మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఫిర్యాదు చేశాను. కానీ వారు పెద్దగా స్పందించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని కొంత మంది హీరోయిన్లకు చెప్పాను. కానీ ఏ ఒక్కరు కూడా నాకు అండగా నిలుబడకపోగా నన్నే బద్నాం చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా ఓ ప్రొడ్యూసర్ కాల్ చేసి ఆయన అభిమానులు నన్ను వదిలిపెట్టరని బెదిరించారు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X