పవన్ కళ్యాణ్‌కి సంబంధం ఉందా? ఫ్యాన్స్‌పై అనుమానమా?.. క్లారిటీ ఇచ్చిన పూనమ్ కౌర్

Recommended Video

Poonam Kaur Filed Complaint Against YouTube Channels || Filmibeat Telugu

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నరని, గత రెండేళ్లుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయని, తన వ్యక్తిగత జీవితం గురించి చెడ్డగా చిత్రీకరిస్తున్నారంటూ తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సమయంలో పూనమ్ కౌర్ పేరు వాడి పవన్ కళ్యాణ్ మీద నిందలు వేస్తూ... కొన్ని ఆడియో టేపులు యూట్యూబ్‌లో హల్ చల్ చేశాయి. మరి ఇంతకాలం మౌనంగా ఉన్న పూనమ్ ఎన్నికల తర్వాత ఫిర్యాదు చేయడానికి కారణమేంటనే కొత్త సందేహాలు సైతం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు.

ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణం

ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణం

‘‘ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణం నేను వివిధ పనులతో బిజీగా ఉండటమే. దీంతో పాటు నా ఆరోగ్యం కూడా బాగోలేదు. ఎవరు చేశారో తెలియదు. వారు నా వ్యక్తిగత జీవితాన్ని చాలా చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.'' అని పూనమ్ కౌర్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ అభిమానులపై మీకు అనుమానం ఉందా?

పవన్ కళ్యాణ్ అభిమానులపై మీకు అనుమానం ఉందా?

‘ఎవరిపై అనుమానం ఉందో పోలీస్ డిపార్టుమెంటుకు చెప్పేశాను... మీతో ఆ విషయాలు పంచుకోలేను' అని పూనమ్ కౌర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులపై మీరు కంప్లయింట్ ఇచ్చినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు.. నిజమా? అనే ప్రశ్నకు పూనమ్ స్పందిస్తూ ‘‘అలాంటిదేమీ లేదండీ' అని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఉందని భావిస్తున్నారా?

పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఉందని భావిస్తున్నారా?

ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఉందని ఏమైనా అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు... ‘‘అలా ఏమీ ఆలోచించడం లేదు. ఏవరో పొలిటికల్ బెనిఫిట్ కోసమే ఇదంతా చేశారని అనిపిస్తోంది. ఎవరికైనా పొలిటికల్ డ్యామేజ్ చేసి దాని ద్వారా మరొకరు పొలిటికల్ బెనిఫిట్ పొందాలనుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులపై పూర్తి నమ్మకం ఉంది.'' అని పూనమ్ స్పష్టం చేశారు.

డిమాండ్ ఏమీ లేదు, రిక్వెస్ట్ మాత్రమే

డిమాండ్ ఏమీ లేదు, రిక్వెస్ట్ మాత్రమే

ఫైనల్‌గా మీ డిమాండ్ ఏమిటి? అని మీడియా ప్రతినిధులు అడగ్గా... నాకు డిమాండ్ ఏమీ లేదు, రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. తప్పుచేసిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి.

వారిని ఊరికే వదలకూడదు

వారిని ఊరికే వదలకూడదు

‘‘ఈ పని చేసిన వారికి అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి. ప్రస్తుతం మన సైబర్ చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి. తప్పు ఎవరు చేశారో కనిపెట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తప్ప నా జీవితం గురించి మాట్లాడటానికి ఎవరికీ హక్కు లేదు.'' అని పూనమ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X