kathi mahesh accident : కర్మ దేవో భవ అంటూ పూనం కౌంటర్లు!

సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా ఆయన గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ పరోక్షంగా కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఆమె ఏమని కామెంట్ చేసిందనే వివరాల్లోకి వెళితే

Recommended Video

Medicare hospital doctors would release health bulletin on Kathi mahesh health condition soon
యాక్సిడెంట్

యాక్సిడెంట్

సినీ విమర్శకుడు కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలోని చంద్రశేఖరపురం వద్ద హైవే లో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

మూడు రోజులు గడిస్తే కానీ

మూడు రోజులు గడిస్తే కానీ

ప్రస్తుతం ఆయన కోమా దశలో ఉన్నారని మరో మూడు రోజులు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని ఆయన సన్నిహితుల నుంచి వివరాలు వెల్లడయ్యాయి. తెల్లవారుజామున చూసుకోకుండా ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

కత్తి vs పూనం

కత్తి vs పూనం

అయితే కత్తి యాక్సిడెంట్ గురించి నటి హీరోయిన్ పూనం కౌర్ పరోక్షంగా కామెంట్స్ చేసింది. నిజానికి పవన్ కళ్యాణ్ విషయంలో పూనమ్ కౌర్ కు కత్తి మహేష్ కు మధ్య సుమారు మూడేళ్ల క్రితం మాటల యుద్ధం నడిచింది. 2018 సంవత్సరంలో ఎన్నికల ముందు కత్తి మహేష్ పూనమ్ కౌర్ మధ్య వివాదం నెలకొంది.

పవన్ కళ్యాణ్ గొడవలో

పవన్ కళ్యాణ్ గొడవలో

పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కత్తి మహేష్ అప్పట్లో టార్గెట్ చేయడంతో పూనం కూడా కత్తి మహేష్ టార్గెట్ గా ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టులో అప్పట్లో హడలెత్తించింది. కత్తి మహేష్ కూడా పూనం తనను టార్గెట్ చేయడంతో తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమె పవన్ కళ్యాణ్ కు నాలుగు భారీ గా ఉండేందుకు సిద్ధమైంది అంటూ కూడా కామెంట్స్ చేసిన రచ్చ రేపారు.

ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నా

ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నా

అలా నడిచిన వివాదం తర్వాత సైలెంట్ అయినా, ఈరోజు కత్తి యాక్సిడెంట్ జరిగిన గురించి ఆమె సంచలన కామెంట్స్ చేశారు. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావు, వదిలేశావు ఏళ్ల నుంచి పద్దతిగా నాపని మాత్రమే చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని కోరుకుంటున్నాను నువ్ ప్రాణాలతో బయటపడాలని.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావని, ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఎవరిని ఉద్దేశించి అని పేర్కొనక పోయినా, నెటిజన్లు మాత్రం అది కత్తి మహేష్ ను ఉద్దేశించే అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X