పవన్ కల్యాణ్ గురించి నోరు విప్పను.. కొంత మంది దూరం చేశారు.. కాంట్రవర్సి అంటూ పూనమ్ కౌర్
Poonam Kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పంజాబీ ముద్దుగుమ్మ అయినప్పటికీ టాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. అయితే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పేరుపై నిరంతరం పోస్టులు షేర్ చేస్తూ వివాదాలలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలనైనా సరే ధైర్యంగా తెలియజేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఆ టాలీవుడ్ డైరెక్టర్ నే కాకుండా బడా హీరోలను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పూనర్ కౌర్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటో మీరే ఓ లూక్కేయండి.
పంజాబీ భామ పూనమ్ కౌర్ 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మాయాజాలం మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగులో టాప్ హీరోస్ సరసన నటించింది. అలాగే. తమిళ , కన్నడ బాషల్లో నటించి, మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్ షోతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంటోంది.

హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్టులు ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది. ఆమె ఇన్ డైరెక్టు గా కౌంటర్లు వేస్తుంటుంది. ఆమె పోస్టు పెట్టిందే.. ఎవర్ని ఉద్దేశించి ఆ పోస్టు పెట్టిందో కచ్చితంగా చెప్పలేం. ఇలా ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది.
హీరోయిన్ పూనమ్ కౌర్ తరచుగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను పరోక్షంగా టార్గెట్ చేస్తోంది. ఏం జరిగిందో తెలియదు గాని అవకాశం చిక్కినప్పుడల్లా హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై తన అక్కస్సును వెళ్లగక్కుతుంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పూనమ్ కౌర్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సంబంధించిన ఓ పాత ఇంటర్య్వూ నెట్టింట్టో తెగ వైరలవుతోంది.
ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ హీరోయిన్ పూనమ్ ఏం మాట్లాడిందంటే.. ఆ ఇంటర్వ్యూలోని యాంకర్ ఫోటోలు చూపిస్తూ.. వారి పై తన అభిప్రాయాన్ని వెల్లడించామన్నాడు. తొలుత విక్టరీ వెంకటేష్ ఫోటో చూపించగానే.. మెడిటేషన్.. పిస్ పుల్, ప్రెంఢ్ అంటు చెప్పుకుంటు వచ్చింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో చూయించగానే.. 'ఒక్క సారిగా షాక్ అయి.. కాంట్రావర్సీ అనేసింది. ఇంకా ఏం చేప్పాలి. అదే కాదా నిజం' అనేసింది పూనమ్.
వెంటనే యాంకర్ రియాక్ట్ అయి.. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పుతారని మరోసారి ప్రశ్నించగా.. ' తనకు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రాలేదు. అవకాశం వచ్చిన చాలా మంది చేయనివ్వలేదు. ఆయన గురించి నేనే ఏం మాట్లాడను. ఏం మాట్లాడినా అది కాంట్రావర్సీ అవుతుంది. పాజిటివ్ చెప్పిన ప్రాబ్లమే.. నెగిటివ్ చెప్పిన ప్రాబ్లమే..అందుకే నేనేం చెప్పా..' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











