వాళ్లే నా జీవితాన్ని నాశనం చేశారు.. వదిలేసి వెళ్లిపోతా అనుకున్నారు.. కన్నీరు పెట్టుకున్న పూనమ్ కౌర్

నటిగా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ సినిమాల కంటే ఈ మధ్య సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆమె ఎమోషనల్‌ అయ్యింది. చాలా గ్యాప్‌తో నటించిన నాతిచరామి సినిమా ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాక ఆ తర్వాత మరో ఛానల్ తో మాట్లాడుతూ అనేక సంచలన విషయాలు పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

 ఆనందంగా ఉందంటూనే

ఆనందంగా ఉందంటూనే

పూనమ్ కౌర్ తాజాగా నాగు గవర అనే దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన నాతిచరామి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా ఉమెన్ సెంట్రిక్ సినిమా కావడంతో ఉమెన్స్ డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పూనమ్‌ కౌర్‌.. స్టేజ్‌పైకి వచ్చి రాగానే చాలా రోజుల తర్వాత మీడియాను, కెమెరాలను ఇలా చూడటం ఆనందంగా ఉందంటూనే ఎమోషనల్‌ అయ్యింది.

చుట్టూ ఉండే రావణులు

చుట్టూ ఉండే రావణులు


ఇక మాటలు రావడం చెబుతూ ఏద్వడం మొదలుపెట్టింది. ఆ పక్కన ఉన్న మరో నటి జయశ్రీ రాచకొండ ఆమెను ఓదార్చగా, కాసేపటికి తేరుకుని తన మనసులోని బాధను, ఈ సినిమా విశేషాలు కూడా పూనమ్ పంచుకుంది. సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేసి మధ్యతరగతి యువతి పెళ్లి కలను చెదరగొట్టారు అని ఆరోపించారు. ఎన్నో పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా చుట్టూ ఉండే రావణులు చెడగొట్టారు అంటూ ఆరోపించింది.

తల్లి తోడుగా ఉండటం

తల్లి తోడుగా ఉండటం


సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే కుటుంబంలో పుట్టానని పేర్కొన్న ఆమె తనని కుటుంబసభ్యులు ఒక దేవతగా పెంచారు. మూడేళ్లుగా వ్యక్తిగతంగానూ, ఆరోగ్యపరంగా ఎంతో నష్టాన్ని అనుభవించానని ఆమె పేర్కొన్నారు. ఎంత జరిగినా వెనకడుగు వేయకుండా సీతాదేవి, ద్రౌపది, దుర్గాదేవి స్ఫూర్తితో మళ్లీ పరిశ్రమలో గెలుపు కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టానని ఆమె పేర్కొన్నారు. ఎన్నో ఆటంకాలు, వేధింపులు ఎదురవుతున్నా తన తల్లి తోడుగా ఉండటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని పూనమ్ కౌర్ వెల్లడించారు.

 యూఎస్‌ వెళ్లిపోతామనుకున్నా

యూఎస్‌ వెళ్లిపోతామనుకున్నా


మధ్యతరగతి కుటుంబాల్లో యువతుల పెళ్లి ఆశలు, కలలకు ప్రతీకగా 'నాతిచరామి' సినిమాలో తన ఇందు పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ మీద కన్ను వేసిన వాడు రాక్షసుడైతాడు. అదే కథైతే.. అంటూ ఈ సినిమా గురించి ఆమె చెప్పుకొచ్చారు. తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్టు కూడా ఆమె వెల్లడించింది. 2017, 18లో నేను పెళ్లి చేసుకుని యూఎస్‌ వెళ్లిపోతామనుకున్నా కానీ నా జీవితాన్ని సినిమా మార్చేసిందని పేర్కొంది.

ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ

ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ


తన జీవితంలో జరిగిన ఒక ఘటన కారణంగా ఇక సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్‌ వెళ్లిపోతాననని మమ్మీకి చెప్పాను కానీ అది కరెక్ట్ కాదని, ఎంతో డిఫికల్ట్ సిచ్చువేషన్స్ లో ఆ విషయం అర్ధం చేసుకున్నానని ఆమె పేర్కొంది. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని పేర్కొంది. ఇక సినిమాలు చేయను, ఇండియా నుంచి వెళ్లిపోతా అనుకున్నప్పుడు ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి, ఒక ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ ఉందని చెప్పిందని ఆమె పేర్కొంది. ఇది రియల్‌ లైఫ్‌ ఇన్స్ డెంట్స్ ఆధారంగా తయారు చేసిందని, భార్య గురించి చెప్పే కథ అని చెప్పడంతో తాను కథ విన్నానని పేర్కొంది.

 జీవితానికి చాలా దగ్గరగా

జీవితానికి చాలా దగ్గరగా

ఈ సినిమాలో ఇందు పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉందని ఆమె పేర్కొంది. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18ఏళ్ల కిడ్‌లా ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ల మహిళ గా ఉన్నాయని దీనింతటికి కారణం తన తల్లే నాని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాను నాగు గవర తెరకెక్కించగా అరవింద్‌ కృష్ణ, సందేష్‌ బూరి ఇతర ముఖ్య పాత్రధారులుగ నటించారు. స్టూడియో 24 ఫ్రేమ్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ఓటీటీ విడుదల కాబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X