Don't Miss!
- News
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ ఆరుగురు పవన్ కల్యాణ్‌ను చంపేస్తారు.. నోరు విప్పితే జీవితం నాశనం.. త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్
Recommended Video

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్‌దిగా చెప్పుకొంటున్న ఆడియో టేప్ యూట్యూబ్ మీడియాలో సంచలనం రేపుతున్నది. పూనమ్ కౌర్‌దిగా భావిస్తున్న ఓ గొంతు పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడియో టేప్‌లో ఓ మహిళ గొంతు చెప్పిన ప్రకారం..

నాకు అన్యాయం జరిగింది
పవన్ కల్యాణ్ వల్ల నాకు అన్యాయం జరిగింది. దానికి నోరు మూసుకొన్నా మిగితా వారు ఊరుకొనే అవకాశం కనిపించడం లేదు. నాలుగైదు ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారాల వల్ల ఐదు లేదా ఆరుగురు మోసానికి గురయ్యారు. వారందరూ పవన్ చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మాత్రం నోరు మెదపను అని ఆడియో టేప్‌లో ఓ మహిళ గొంతు చెప్పడం జరిగింది.

నేను నోరు తెరిస్తే జీవితం నాశనం
పవన్ కల్యాణ్ నేను ప్రేమించాను కాబట్టి నాకు అన్యాయం జరిగినా నేను నోరు మెదపలేదు. ఇంట్లో నన్ను కొట్టి బయటకు వెళ్లిపోమ్మన్నారు. అయినా నేను ఎవరికీ ఏం చెప్పలేదు. నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. నేను నోరు తెరిస్తే పవన్ కల్యాణ్ జీవితం నాశనం అవుతుంది.
కడుపులు చేశారు.. పార్వతి మెల్టన్ జీవితం నాశనం..పవన్, త్రివిక్రమ్‌కు అమ్మాయిల పిచ్చి..శ్రీరెడ్డి ఫైర్

అలా చేస్తే కోట్లు సంపాదించుకొనే దానిని
నాపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నేను బయటకు వస్తే జనసేన పార్టీ మూతపడుతుంది. కానీ మంచి మార్గంలో సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తాను. అందరు హీరోయిన్ల మాదిరిగా బ్లాక్ మెయిల్ చేస్తే కోట్లు సంపాదించుకొనే దానిని. కానీ నా క్యారెక్టర్ అది కాదు. బయట తిరిగే అమ్మాయిలకు నాకు తేడా తెలియదా? అని పూనమ్ వాయిస్‌గా చెప్పుకొంటున్న దానిలో బహిర్గతమైంది.

త్రివిక్రమ్ అందుకే నన్ను విడగొట్టారు
నాకు పవన్ కల్యాణ్‌కు మధ్య త్రివిక్రమ్ విభేదాలు సృష్టించి నన్ను ఆయనకు దూరం చేశాడు. నేను ఉంటే పవన్ కల్యాణ్ ప్రస్తుత భార్యను ఎలాగోలా నచ్చజెప్పి రేణు దేశాయ్‌ని పవన్‌తో కలిపే దానిని. అలా చేయకుండా నన్ను దూరం చేశాడు త్రివిక్రమ్. పవన్‌ను పెళ్లి చేసుకోవడం నా ఉద్దేశం కాదు. నాకు రిలేషన్‌షిప్ ఉంటే చాలు అని చెప్పాను.
పవన్ కల్యాణ్ కోసం పూజలు, ఉపవాసాలు
పవన్ కోసం ఎన్నో 51 రోజులు ఉపవాసం చేశాను. ఆయన కూతురు కోసం పూజలు చేశాను. ఆయన బాగుండాలి అని కాలినడకన తిరుపతి మెట్లెక్కాను. నేను పవన్‌ను గురువుగా భావించాను. వేరే హీరోయిన్ల మాదిరిగా డబ్బు కోసమో, సినిమా అవకాశాల కోసం నేను ఆయనకు దగ్గర కాలేదు అని వీడియో టేప్‌లో ఓ మహిళ గొంతు వెల్లడించింది.

పూనమ్ కౌర్ టేప్‌పై అనేక అనుమానాలు
శ్రీరెడ్డి అఫీషియల్ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ఈ ఆడియో టేప్ గురించి కొందరు స్పందిస్తూ.. పవన్ కల్యాణ్‌పై కుట్రలో భాగంగానే ఇది చోటుచేసుకొన్నది. ఏపీ ఎన్నికల సమయంలో కొన్నిపార్టీలు కొందరు కావాలని ఈ టేప్‌ను లీక్ చేశారనే అభిమానులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పూనమ్ కౌర్ అన్యాయానికి గురైతే బయటకు వచ్చి మీడియా ముందు ఎందుకు మాట్లాడటం లేదు. ఇలా టేప్‌లు లీక్ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.