ఆ క్షుద్రపూజతో జీవితం నాశనం... ఆ పొలిటీషియన్‌తో పెళ్లంటూ దారుణంగా.. పూనం కౌర్ షాకింగ్ కామెంట్స్
సినిమాలకు దూరంగా ఉంటున్నా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు నటి పూనం కౌర్. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వివాదాస్పద పోస్ట్‌లు, ట్వీట్‌లు చేస్తుంటారు. చిత్ర పరిశ్రమలోని పలు అంశాలతో పాటు సమకాలీన విషయాలపైనా స్పందిస్తూ తన వెర్షన్ వినిపిస్తుంటారు. ముఖ్యంగా ఆడవారి హక్కులు, సమానత్వంపై పోరాడుతున్నారు. ఇప్పటి వరకు మీడియాకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వని పూనం.. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌తో పాటు ఇండస్ట్రీలోని వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ వివరాల్లోకి వెళితే..
సాక్ష్యాధారాలు అడుగుతున్నారు
నేను ఓ వ్యక్తిపై మా అసోసియేషన్‌లో కంప్లయంట్ ఇచ్చాను.. ఒక మామూలు ఘటనని వీళ్లు నన్ను క్రిమినల్ మాదిరిగా చూపించి నా లైఫ్ అంతా సర్వనాశనం చేశారు. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదని పూనం కౌర్ ఎమోషనల్ అయ్యారు. మీడియాలో డిస్కషన్స్ పెట్టి చెప్పినది ఏంటీ అంటే పూనం కౌర్ ఫిర్యాదు ఇచ్చాను అంటున్నారు కానీ దానికి ఎక్కడా ఎవిడెన్స్ లేదని యాంకర్ ప్రశ్నించగా.. మీడియాను కొనే అర్హత నాకు లేదు, మీడియాతో మాట్లాడే ఇష్టం కూడా నాకు లేదు. ఒకే ఒక్క మనిషిని గుర్తుపెట్టుకోవాలి. ఆయనే దాసరి నారాయణరావు గారు. తండ్రి లేకుండా ఆడపిల్ల జీవించడం కష్టం అని పూనం కౌర్ అన్నారు.

మా అసోసియేషన్ బాధ అదే
మా అసోసియేషన్ మీ ఫిర్యాదుపై ఎందుకు రెస్పాండ్ కావడం లేదని యాంకర్ ప్రశ్నించగా.. ఒక అమ్మాయి ఇలాంటి ఇష్యూపై రెస్పాండ్ అయితే అందరు అమ్మాయిల కోసం రెస్పాండ్ అవ్వాలా? ఇలాంటి రోజూ జరుగుతూనే ఉంటాయని వాళ్లు అభిప్రాయపడొచ్చు. ఇక్కడ పొలిటికల్ అయిపోతుందని వీళ్ల ఫీలింగ్.. ఏదైనా ఉండొచ్చు. నేను ఝాన్సీ గారికి నా కంప్లయంట్ ఇచ్చాను. నా జీవితం మొత్తం కోల్పోయిన తర్వాత అందరి కంటే ఎక్కువ ఫీలైంది నా మమ్మీ అని పూనం కౌర్ తెలిపారు.
నా మీద క్షుద్ర ప్రయోగం
ఒక వ్యక్తి మీ మీద బ్లాక్ మేజిక్ పూజ చేయించారా అని యాంకర్ ప్రశ్నించగా... నాకు యాక్సిడెంట్ అయ్యింది, చర్మం నాశనమైంది, 18 ఏళ్ల వయసున్న అమ్మాయి వెంటాడుతున్నట్లుగా అనిపించింది. మా నాన్న నా వెనుకే ఉండి నడిపిస్తున్నారు. శివుడిని ప్రేమించే వ్యక్తిని కాబట్టి నేను కూడా ఒక శివని, పార్వతిని, ఒక లింగ భైరవిని ఆ అంశం నాలో ఉందని నేను అనుకున్నా. ఒక పార్టీకి నేను మద్ధతుదారురాలిని అని జనాలు మాట్లాడుతున్నారు. అప్పుడు మీ మమ్మీకి హార్ట్ ఎటాక్ వస్తే మీకు గిల్టీగా ఉండదా. లెగసిని ముందుకు తీసుకు వెళ్లలేదు కానీ.. వాళ్ల డబ్బులు తినేస్తే. లెగసీ అంటే విలువలు.. డబ్బు కాదు. రాజశేఖర్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవమేనని పూనం కౌర్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీతో లింక్ పెట్టేశారు
రాహుల్ గాంధీ గారితో మీరొక ఈవెంట్‌లో చేయి పట్టుకుని నడిచినప్పుడు... మీరు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారా? అని కొంతమంది అడిగారు. ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయని యాంకర్ ప్రశ్నించగా.. నా మ్యారేజ్ అయిపోయింది, అబార్షన్ కూడా అయిపోయింది, నాకు ఇద్దరు పిల్లలు. దాని తర్వాత నాకు రాహుల్ గాంధీ గారితో కూడా మ్యారేజ్ అయిపోయింది, ఆయనతోనూ ఎఫైర్ ఉంది. వీటన్నింటికీ మీడియాకు థ్యాంక్స్. నిజానికి నేను అనుకున్న మ్యారేజ్ అవ్వలేదు... పొలిటికల్ లీడర్స్‌కి దగ్గరగా ఉన్న అమ్మాయిల గురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే వాళ్లు దగ్గరగా ఉన్నారు కాబట్టి. దగ్గరగా లేనివాళ్ల గురించే మాట్లాడతారు. ఓ రోజు ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత ఒక డైరెక్టర్ నన్ను పిలిపించారు అని పూనం కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పూనం కౌర్‌ని పిలిపించిన డైరెక్టర్ ఎవరు? ఆమెపై చేతబడి చేయించింది ఎవరు? మా అసోసియేషన్ వాళ్లు ఎందుకు ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











