Poonam Kaur : అమ్మాయిల‌ను నగ్నంగా, వాడుకుంటారు.. పేరు పెట్టి వర్మను, పెట్టకుండా మరో డైరెక్టర్ ని?

చేసిన సినిమాలు తక్కువే, మామూలుగా అయితే ఆమెను ఇప్పటికి జనం మర్చిపోవాలి కానీ ఆమె వివాదాల కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె ఎవరో కాదు నటి పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో ఆమె ఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికీ తెలుసు. తాజాగా ఆమె చేసిన వరుస ట్వీట్లు కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది పూనమ్. ఆ వివరాల్లోకి వెళితే

వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి

వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి


రాజకీయాలు ఎంటర్‌‌టైన్మెంట్ గా, ఎంటర్‌‌టైన్మెంట్ రాజకీయాలుగా మారుతున్నాయి అని ట్వీట్ చేసింది. అయితే దీనికి ముందు మరో ట్వీట్ చేసింది పూనమ్.. అందులో.. " నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు.. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండడం బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి" అని రాసి దానికి బ్రోకెన్ హార్ట్ సింబల్ కూడా జోడించింది.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్

సోషల్ మీడియాలో హాట్ టాపిక్

అయితే ట్వీట్ చేసిన కాసేపటికే ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ స్పీచ్ మీద రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లని ట్యాగ్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మహిళలను ఆయుధంగా

మహిళలను ఆయుధంగా

ఆర్జీవీ "భీమ్లా నాయక్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను జత చేస్తూ, పవన్ కళ్యాణ్ బెస్ట్ స్పీచ్ లలో ఒకటి, హార్ట్ ఫెల్ట్, ఎమోషనల్ అంటూ కామెంట్స్ చేశారు. అదే ట్వీట్ కు పూనమ్ రిప్లై ఇస్తూ "ఒక దర్శకుడు మూల నుండి నవ్వుతూ, వ్యక్తిగత స్థలం కోసం బహిరంగంగా, తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తే, మరొక దర్శకుడు రాజకీయంగా అతనిని కించపరచడానికి ఏదైనా చేస్తాడు. ఇద్దరూ అద్దెకు, డబ్బులు తీసుకుని ఏజెంట్లుగా మహిళలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. అని పేర్కొంది. ఒకరు ఆర్జీవీ కాగా మరొకరు ఎవరు? అనే చర్చ జరుగుతోంది.

అమ్మాయిని నగ్నంగా ఉండడం

అమ్మాయిని నగ్నంగా ఉండడం


ఇక అలాగే రాజకీయ ఎజెండా కోసం SC, ST అభ్యర్థిని ఉపయోగించడం, రాజకీయ ఎజెండా అమలు చేయడానికి ఒక అమ్మాయిని నగ్నంగా ఉండడం, ఒక అమ్మాయి కాల్స్ ట్యాప్ చేయడం, ఆమెకు డబ్బు అందించడం, ఆమె వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఆమెను బెదిరించడం, నియంత్రించడం అంటూ ట్వీట్ చేసింది.

Recommended Video

Nathicharami Movie theatrical Trailer | Filmibeat Telugu
పెళ్లిళ్లపై?

పెళ్లిళ్లపై?

"ఆంధ్ర ప్రదేశ్ గత ఎన్నికల్లో జరిగిన బిగ్గెస్ట్ క్రైమ్ ఏమిటి? మనం నిజంగా దృష్టి కేంద్రీకరించింది ఏమిటి? పెళ్లిళ్లపై?" అంటూ ఓ ట్వీట్ తో ప్రశ్నించగా, "నిజమేమిటో బయటకు రావాలి, సత్యమేవ జయతే" అంటూ ఇంకో ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారింది పూనమ్ కౌర్. ఈ ట్వీట్స్ మొత్తంలో ఆమె ఏ ఒక్కరి పేరు చెప్పలేదు గానీ, ఆ ట్వీట్ ఎవరెవని ఉద్దేశించి చేసిందో మాత్రం అర్థమయ్యే విధంగా ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X