హీరోయిన్‌పై మోజుతో భార్యకు చిత్రహింసలు.. వైఫ్‌ను కోమాలోకి పంపిన ఆ డైరెక్టర్ నిజస్వరూపం ఇదే.. పూనమ్ కౌర్

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తనకు నచ్చిన విషయాలపై ఓపెన్‌గా మాట్లాడటం, నచ్చని అంశాలపై డైరెక్ట్‌గా స్పందించడం పూనమ్‌కు అలవాటే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారమే రేపుతున్నాయి.

ఇటీవల పూనమ్ కౌర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఈ సందర్భంగా గతంలో పునమ్ కౌర్ 'మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు. అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అంటూ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. దాని వెనుక ఉన్న బాధాకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఆ ట్వీట్ వెనుక నిజంగా ఏం జరిగిందో చెప్పుకొచ్చింది.

Poonam Kaur Shocking Allegations on Director Go Viral Exposes Dark Side of Tollywood Industry

పూనమ్ మాట్లాడుతూ.. 'నేను సరదాగా లేదా పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేయను. నాకు హార్ట్‌కు టచ్ అయిన విషయం ఉంటేనే మాట్లాడతాను. నేను ఆ బాధను అనుభవించినప్పుడు లేదా దగ్గరగా చూసినప్పుడు మాత్రమే అలా స్పందిస్తాను. చిన్న ట్వీట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్‌గా మారుతుంది, ఎక్కడలేని డిస్కషన్లు జరుగుతాయి'అని చెప్పింది. అంతేకాదు.. ఆమె చేసిన ఆరోపణలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి.' మీకు తెలుసా... ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది'అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరొక మహిళ కోసం కట్టుకున్న భార్యను ఇలా హింసించడం తనను తీవ్రంగా కలచివేసిందని పూనమ్ చెప్పింది. ఆ ఇల్లాలని ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు. అంతటి అన్యాయం జరిగినా ఆ మహిళ ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. తనకు జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. పైగా ఆ హీరోయిన్ ఆడియో ఫంక్షన్‌లలో స్టేజ్‌పై కూడా కనిపించింది. ఈ రోజు వరకూ కూడా ఆ మహిళ తాను ఎదుర్కొన్న చిత్రహింసల గురించి బయటపెట్టలేదు. వారం రోజులపాటు కోమాలో ఉండాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఎంత భయంకరమో అర్థం చేసుకోవచ్చు' అంటూ తన మనసులోని వేదనను బయటపెట్టింది.

ఈ విషయాలన్నీ తనకు తర్వాత తెలిసాయని, తెలుసుకున్న క్షణంలో నిజంగా షాక్ అయ్యానని పూనమ్ వెల్లడించింది. 'మనుషులు ఇలా కూడా ఉంటారా? కట్టుకున్న భార్యతో ఇలా ప్రవర్తిస్తారా... మరొక ఆడదాని కోసం?' అంటూ ఆమె వేసిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ఘటనలో పాల్గొన్న డైరెక్టర్ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయాలను మాత్రం పూనమ్ కౌర్ బయటపెట్టలేదు.

ఇదిలా ఉండగా, పూనమ్ చేసిన ఆ ట్వీట్ టైమింగ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్ సమంత- నిడిమోరు పెళ్లి వార్తల తర్వాత రావడంతో, నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఇన్‌డైరెక్ట్‌గా వారినే ఉద్దేశించిందా?' అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ నెటిజన్ల ఊహాగానాలే తప్ప, దీనిపై పూనమ్ కౌర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగా ఆమె ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడిందో మాత్రం ఆమెకే తెలియాలి. అయినా, ఒక సెలబ్రిటీ నోటి నుంచి ఇలాంటి ఆరోపణలు రావడంతో టాలీవుడ్‌లో మళ్లీ 'డార్క్ సైడ్'పై చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తులు స్పందిస్తారా? పూనమ్ కౌర్ మరిన్ని వివరాలు బయటపెడతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X