పవన్ కల్యాణ్‌పై పూనమ్ కౌర్ దారుణమైన పోస్ట్.. ఆడ పిల్లలను వదిలిపెట్టరా?
గత కొన్ని రోజులు నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ హీరో అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు, తన ప్రస్తావన లేకుండా ఒక రోజు కూడా ఉండదని చెప్పొచ్చు. కాగా అది రాజకీయ పరంగా అయినా సినిమాల పరంగా కూడా పవన్ పేరు ఏదొక రకంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజులు నుంచి మాత్రం మరింత స్థాయిలో నేషనల్ వైడ్ గా వార్తల్లో కనపడుతున్నారు.
కాగా పవర్ స్టార్ తిరుమల లడ్డు విషయంలో చేసిన కామెంట్స్ కానీ చేస్తున్న పనులు కానీ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇక ఇవీ కాకుండా పలు కాంట్రవర్సీలు కూడా పవన్ చుట్టూతా వినిపిస్తున్నాయి. ఇలా ఓ రేంజ్ లో పవన్ వార్తల్లో వైరల్ గా మారుతూ వస్తున్నారు.

అయితే ఇవన్నీ చాలవు అన్నట్టుగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ పవన్ విషయంలో చేస్తున్న పోస్ట్ లు కామెంట్స్ కూడా ఒకింత కాంట్రవర్సియల్ గా మారుతూ వస్తున్నాయి. మరి లేటెస్ట్ గా ఈమె చేసిన మరో సంచలన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్న పవన్ తిరుమలకి కాలి నడకన అలిపిరి నుంచి నడిచి వెళ్లి తిరుమలేశుని దర్శనార్థం వెళ్లిన సంగతి తెలిసిందే.
కానీ నేడు సర్ప్రైజింగ్ గా తన ఇద్దరు భార్యల కూతుర్లు ఆద్య అలాగే పలిన అంజనా కొణిదెల కూడా పవన్ కనిపించి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఐతే ఈ ఫోటోలు చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కలయికపై నటి పూనమ్ కౌర్ అయితే పవన్ విషయంలో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యిపోయింది.
తన స్వంత లాభాలు కోసం పిల్లలని కూడా వాడుకోవడం దారుణం అని ఇతరుల కూతుర్లు అంత ముఖ్యమైన వాళ్ళు కానట్టేనా అన్నట్టుగా పవన్ పేరు ఎక్కడా ఎత్తకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది. దీనితో ఇది పవన్ యాంటీ ఫ్యాన్స్ లో అటెన్షన్ గా మారి వైరల్ గా మారింది. అయితే పవన్ ఈరోజే తన ఇద్దరు కూతుళ్లతో కనిపించడం పూనమ్ కూడా ఇదే సంఘటనకి దగ్గరగా పోస్ట్ చేయడంతో ఇది పవన్ కోసమే అని ఆమె చెప్పకపోయినా అందరికీ అర్ధం అయ్యిపోయింది.

కాగా గత కొన్నాళ్ల నుంచి పవన్ విషయంలో పలుమార్లు పూనమ్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రోజులు కితమే పవన్ ఫ్రెండ్ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు తివిక్రమ్ విషయంలో కూడా చేసిన పోస్ట్ ఒకటి సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. మరి పవన్, త్రివిక్రమ్ విషయంలో పూనమ్ యుద్ధం ఎప్పటికి ఆపుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











