భర్త నుంచి విడిపోయిన హీరోయిన్.. మళ్ళీ డేటింగ్ చేస్తారా అంటే, ఏమందంటే!

నటి పూనమ్ పాండే తరచూ వివిధ కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు ఆమె తన హాట్ వీడియోల కారణంగా హాట్ టాపిక్ గా మారగా మరి కొన్నిసార్లు ఆమె తన భర్త సామ్ బాంబే గురించి చర్చనేయంశంగా మారింది. తాజాగా ఆమె తన డేటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు

కుండ బద్దలు

కుండ బద్దలు


గత ఏడాది నవంబర్ 7న, పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే పై దాడికి సంబంధించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత సామ్‌ను అరెస్టు చేశారు. అదే సమయంలో, పూనమ్ కూడా ముంబైలోని ఆసుపత్రిలో చేరింది. తరువాత పూనమ్ పాండే స్పాట్‌బాయ్‌ అనే పత్రికతో సంభాషణలో చాలా రహస్యాలను వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ నుండి సామ్ బాంబే వరకు పూనమ్ అనేక విషయాలు మాట్లాడింది.

కుండ బద్దలు

కుండ బద్దలు

తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన ఆమె 'సామ్‌ బాంబే గురించి నేనిప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఓ థెరపిస్ట్‌ దగ్గర చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా డేటింగ్‌ చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఛాన్సే లేదు అని కుండ బద్దలు కొట్టింది. ఐదేళ్ల వరకు ఇలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోనని స్పష్టం చేసింది.

థెరపిస్ట్ వద్దకు వెళ్లి,

థెరపిస్ట్ వద్దకు వెళ్లి,

పూనమ్ పాండే, సామ్ నుండి విడిపోయిన విషయంపై ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మరియు నేను సామ్ బాంబే గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు అని అంది. నేను హీలింగ్ ప్రాసెస్‌లో ఉన్నాను. నేను థెరపిస్ట్ దగ్గరకు వెళుతున్నానని ఆమె చెప్పింది.

కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోలేదు

కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోలేదు


ఇక ఆ ఇంటర్వ్యూలో పూనమ్ పాండే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, 'చాలా మంది దీని గురించి నన్ను అడిగారు. కానీ నేను ఒక్కసారి కూడా కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కోలేదు. ఎవరైనా అనుభవించినట్లయితే, అది చాలా చెడ్డ విషయం. పరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్‌లు లేరు, బాలీవుడ్‌లో నాకు ప్రత్యేకమైన స్నేహితులు లేరు. నా కోసం నేనేం చేసినా నేనే చేశాను.

విక్కీ కౌశల్‌ల తరహా ప్రేమకథ కావాలి

విక్కీ కౌశల్‌ల తరహా ప్రేమకథ కావాలి


సెప్టెంబర్ 2020లో, పూనమ్ పాండే సామ్ బాంబేని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో, ఈ జంట గోవాలో హనీమూన్ కోసం వెళ్ళినప్పుడు, పూనమ్ సామ్‌పై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఆ సమయంలో పూనమ్ సామ్ నుండి విడిపోవాలని కూడా కామెంట్స్ చేసింది కానీ ఏమైందో ఏమో మళ్ళీ కలిశారు. తనకు ఎప్పుడైనా మిస్టర్ రైట్‌ను కలిసినట్లయితే కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్‌ల తరహా ప్రేమకథను కలిగి ఉండాలని కోరుకుంటున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఆమె మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X