పబ్లిక్ లోనే పూనమ్ పాండేకు ముద్దు... బలవంతగా నటిని.. వీడియో వైరల్!

సంచలన నటి, మోడల్ పూనమ్ పాండేకు తాజాగా చేధు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్ గా పోస్టు పెడుతూ ఉండే ఈమె పబ్లిక్ లో అసభ్యకరమైన ఘటనను ఎదుర్కొంది. తన అభిమానిని అంటూ ఓ వ్యక్తి పూనమ్ పాండే వద్దకు వచ్చి ముద్దు పెట్టే ప్రయత్నం చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. దానికి పూనమ్ పాండే భయపడి పోవడం, అతనికి దూరంగా పారిపోవడంతో తనను రక్షించుకుంది. అయితే ఈ ఘటన జరగడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అయితే.. హీరోయిన్లకు, సెలబ్రెటీలకు సహజంగానే పబ్లిక్ లో తిరగాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానం పేరుతో అక్కడక్కడా ఫ్యాన్స్ చేసే పనులు కాస్తా కోపం తెప్పించేలా ఉంటుంది. వాటికి సంబంధించిన వీడియోలు చూసిన మనకే ఎంతో బాధాకరంగా ఉంటే.. అలాంటి ఘటనలను అనుభవిస్తున్న సెలబ్రెటీల బాధలు మాములువి కాదనే చెప్పాలి. ఆ సమస్యలు వారికి మాత్రమే తెలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినా అభిమానులపై ఎవ్వరూ ఒక్క మాటకూడా అనబోరు.

Poonam Pandey Fan Forcibly try to kiss her Actress shocked to his behaviour

అయితే తాజాగా మోడల్, నటి పూనమ్ పాండేకు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. ముంబై నగరంలో తన పని నిమిత్తం బయటికి వచ్చిన ఆమెకు చేధు అనుభవం ఎదురైంది. తనను గుర్తించిన అక్కడ కొందరు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో వెనకాల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఓ వ్యక్తి పూనమ్ పాండే వద్దకు వచ్చాడు. ఆమెతో సెల్ఫీ దిగుతానని చెప్పి చేతితో ఫోన్ పైకెత్తుతాడు. నటి పూనమ్ పాండే అనుమతించకున్నా అతను మాత్రం వెకిలి చేష్టలు చేస్తుంటాడు.

అప్పటికీ ఓపిగ్గా పూనమ్ పాండే సెల్ఫీకి స్టిల్ ఇచ్చినా.. అభిమానం పేరుతో ఆ వ్యక్తి పూనమ్ పాండే తో అసభ్యంగా ప్రవర్తించాడు. పబ్లిక్ లోనే ఆమెను ముద్దుపెట్టుకోబోయి అందరినీ షాక్ కు గురిచేశాడు. అంతా గమనిస్తున్న పూనమ్ పాండే వెంటనే అతన్ని వెనక్కి నెట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ వెంటనే పూనమ్ పాండేకు తోడుగా వచ్చిన సభ్యులు అతన్ని నివారిస్తారు. పూనమ్ పాండే మాత్రం షాక్ లో భయపడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నటితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వీడియోను బట్టి అతను మద్యం మత్తులోనూ ఉన్నాడని.. మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేకుండా.. బహిరంగంగా ఇలా ప్రవర్తించిన అతనికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సెన్సేషనల్ పోస్టులు పెడుతూ అందరినీ షాక్ గురి చేసే పూనమ్ పాండే.. కావాలనే ఇలాంటి ఫేక్ వీడియోను కూడా పెట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ వీడియోను బట్టి చూస్తే అభిమానం పేరుతో వ్యక్తి మిస్ బిహేవియర్ కనిపిస్తుందని తెలుస్తోంది. ఇక పూనమ్ పాండే కంగనా రనౌత్ హోస్ట్ గా నిర్వహించిన 'లాక్ అప్' గేమ్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ లోనూ మెరిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X