twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తనే అరెస్ట్ చేయించిన పూనమ్ పాండే.. పెళ్లైన పది రోజులకే కటకటాల్లో కొత్త పెళ్లి కొడుకు!

    |

    ఇటీవలే పెళ్లి చేసుకొన్న పూనమ్ పాండే ఏకంగా తన భర్త సామ్ బాంబేపై కేసు నమోదు చేసింది. తనపై లైంగిక దాడి చేశారంటూ భర్తపై ఫిర్యాదు చేయడంతో సామ్ బాంబేను అరెస్ట్ చేశారు. దాంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తను జైల్లో పెట్టించడం ఇప్పుడు చర్చగా మారింది. పూనమ్ పాండే భర్త అరెస్ట్ విషయంలో ఏం జరిగిందంటే....

    సెప్టెంబర్ 10వ తేదీన పెళ్లి

    సెప్టెంబర్ 10వ తేదీన పెళ్లి

    పూనమ్ పాండే చాలా ఏళ్లుగా ప్రేమిస్తున్న ప్రియుడు సామ్‌ బాంబేను సెప్టెంబర్ 10న పెళ్లి చేసుకొన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకలో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడినట్టు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఎట్టకేలకు మా పెళ్లి జరిగిందంటూ కామెంట్ చేశారు. కొద్ది నెలల క్రితమే వారి ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

    భర్తతో హానీమూన్ జోరు

    భర్తతో హానీమూన్ జోరు

    ఇటీవల భర్తతో హానిమూన్ జరుపుకొంటున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలను పెట్టారు. తన ఫ్యాన్స్‌ను ఆటపట్టిస్తూ ఫోటోలను, వీడియోలను షేర్ చేసి కవ్వించారు. హానిమూన్‌ను గొప్పగా జరుపుకొంటున్నాం అని పూనమ్ పాండే వెల్లడించారు. ఇలా వారి కాపురం హ్యాపీగా సాగుతుందున్న క్రమంలో ఏకంగా భర్తపైనే లైంగికంగా వేధించారంటూ అరెస్ట్ చేయించడం సంచలనం రేపింది.

    నాపై లైంగిక, శారీరక దాడి చేశాడంటూ

    నాపై లైంగిక, శారీరక దాడి చేశాడంటూ

    పూనమ్ పాండే తన సినిమా షూటింగ్ కోసం గోవాలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి తన భర్త వేధించాడు, శారీరకంగా దాడికి పాల్పడ్డారని దక్షిణ గోవాలోని కనకోనా గ్రామం పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి సామ్ బాంబేను అరెస్ట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.

    Recommended Video

    Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
    పూనమ్ పాండే ఫిర్యాదులోనే అరెస్ట్ అంటూ గోవా పోలీసులు

    పూనమ్ పాండే ఫిర్యాదులోనే అరెస్ట్ అంటూ గోవా పోలీసులు

    నా భర్త నాపై అత్యాచారం జరపబోయాడు. నా ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. నేను అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాడి చేశాడు. లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బయటపెడితే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోనాల్సి వస్తుందని బెదిరించాడని పూనమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో సామ్ బాంబేను అరెస్ట్ చేశాంఅ ని కనకోనా పోలీస్ ఇన్స్‌పెక్టర్ తుకారాం చవాన్ మీడియాకు వెల్లడించారు.

    English summary
    Poonam Pandey husband Sam Bombay arrested in Goa: Bollywood actress poonam has given complaint on her husband that, He was molested, threatened and assaulted. On Poonam complaint Canacona polices arrested sam bombay.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X