రహస్యంగా పెళ్లి చేసుకొన్న పూనమ్ పాండే.. పెళ్లి కొడుకు ఎవరంటే..
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే పెళ్లికూతురుగా మారింది. కొద్దికాలంగా ప్రేమిస్తున్న ప్రియుడిని పెళ్లి చేసుకొన్నది. నిరాడంబరంగా జరిగిన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ట్రెండింగ్ నిలిచాయి. ఆమెకు అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు ఈ సందర్భంగా వివాహ శుభాకాంక్షలు అందించారు. పూనమ్ పాండే పెళ్లి గురించిన వివరాల్లోకి వెళితే..

ఇన్స్‌టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలతో
సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధాన మీడియాలో పూనమ్ పాండే చేసే కామెంట్లు, పోస్టులు సెన్సేషన్‌గా ఉంటాయి. ఇక ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసే వీడియోలు మరింత శృంగారాన్ని కలబోసి ఉంటాయి. ఆమెకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారు. పూనమ్ తన పెళ్లి వార్తను ఇన్స్‌టాలో షేర్ చేయగానే వైరల్ అయింది.

అందంగా ముస్తాబైన శృంగార తార
పూనమ్ పాండే, ఆమె ప్రియుడు నూతన వధూవరులుగా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకొన్నారు. పెళ్లి కుమారుడు సామ్ బాండే కుర్తా, ప్యాంట్‌లో ఆకట్టుకొనేలా ఉన్నాడు. ఇక పూనమ్ పాండే నిండుగా వస్త్రాలను ధరించారు. లహెంగాతోపాటు భారీగా నగలు ధరించి పెళ్లికూతురుగా అలరించారు.

జూలైలో నిశ్చితార్తంతో షాక్
గత జూలై మాసంలో పూనమ్ పాండేకు సామ్ బాంబేతో వివాహం జరిగింది. నిశ్చాతార్థం సమయంలో ఉంగరాలు మార్చుకొన్న విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. చివరకు నా బాయ్‌ఫ్రెండ్‌తో ఊహించింది జరిగింది అంటూ కామెంట్ పెట్టారు. తమ రొమాంటిక్ జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
Recommended Video

బాయ్‌ఫ్రెండ్‌తో సుదీర్ఘంగా రొమాన్స్ చేసింది.
తమ నిశ్చితార్థం సమయంలో పూనమ్ ఓ హాట్ ఫోటోను షేర్ చేసి.. ఓ గులాబి కంటే ముద్దు గొప్పది అంటూ కామెంట్ చేసింది. అలాగే బాయ్‌ఫ్రెండ్‌తో కూడిన సెక్స్ టేప్‌ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత వివాదంగా మారుతుండటంతో దానిని డిలీట్ చేసింది. పూనమ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో సుదీర్ఘంగా రొమాంటిక్ జీవితాన్ని గడిపి చివరకు ఒక్కటయ్యారు.


Click it and Unblock the Notifications











