కుక్కలా కొట్టారు.. బెడ్‌రూమ్‌లో బంధించారు.. ఉప్పు నీళ్లతో అన్నం.. దుర్భర జీవితాన్ని బయట పెట్టిన పూనమ్
పూనమ్ పాండే వివాదాల గురించి మనందరికీ తెలుసు. ఆమె బోల్డ్ పబ్లిక్ స్టంట్‌లు చాలా వరకు ఆమెను ఒక వివాదాస్పద నటిగా నిలిపాయి. అయితే పూనమ్ పాండే బాల్యం ఎలా ఉండేదో మనలో ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో ఆమె ఎంత కష్టపడింది? పూనమ్ పాండే మరియు ఆమె కుటుంబం తినడానికి కూడా డబ్బు లేని సందర్భాలు చాలా సార్లు ఉన్నాయట. కంగనా రనౌత్ 'లాక్ అప్' షోలో పూనమ్ ఈ విషయాలన్నీ చెప్పింది.ఆ వివరాల్లోకి వెళితే

తిండి పెట్టడం కోసం
కంగనా రనౌత్ 'లాక్ అప్' షోలో పాల్గొన్న పూనమ్ పాండే తనకు ఫేమ్ రావడానికి ముందు జీవితం ఎంత కష్టతరమైనదో చెప్పింది. మునవ్వర్, అంజలి మరియు సాయేషాతో జరిగిన సంభాషణలో పూనమ్ పాండే తాను సాధారణ కుటుంబానికి చెందిన దాన్ని అని చెప్పింది. తన తల్లి తమకు తిండి పెట్టడం కోసం చాలా కష్టపడిందని ఆమె వెల్లడించింది.

ఉప్పు నీళ్లతో అన్నం
తినడానికి డబ్బులు లేనప్పుడు ఉప్పు నీళ్లతో అన్నం తినేవాళ్లమని ఆమె పేర్కొంది. పబ్లిసిటీ స్టంట్స్ కోసం తాను చాలా పనులు చేశానని, అయితే అలా చేయడం వల్లనే ఈరోజు తన అన్న, చెల్లి జీవితంలో స్థిరపడ్డారని గర్వంగా ఉందంటూ తన బాధను చెప్పింది. జనాలు ఏం చెప్పినా తాను పట్టించుకోనని పేర్కొన్న ఆమె నా సొంత నియమ నిబంధనల ప్రకారం తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతానని పేర్కొంది.

ద్వేషించనని
పూనమ్ పాండే ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు, ఆమె భావోద్వేగానికి గురైంది, ఆ తర్వాత తోటి ఖైదీలందరూ ఆమెకు చప్పట్లు కొట్టి ఆమె మనోధైర్యాన్ని పెంచారు. అంతకుముందు, పూనమ్ పాండే కరణ్‌వీర్ బోహ్రా మరియు పాయల్ రోహత్గీలతో మాట్లాడుతూ తాను సామ్‌ను ద్వేషించనని చెప్పడం కనిపించింది. కేవలం అతని పనులు కొన్నిటిని ఇష్టపడలేదని పేర్కొంది.

ఆహారం తినడం
తన వివాహనంతరం తనను మానసికంగా హింసించారని, అందుకే తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించింది. నటి పూనమ్ పాండే ఇంకా మాట్లాడుతూ తనకు బాగా నిద్రపోవడం, రుచికరమైన ఆహారం తినడం ఇష్టమని, అది తన వివాహ జీవితంలో మిస్సయిందని అన్నారు. తనను కుక్కలా కొట్టారని, తన బెడ్‌రూమ్‌లో బంధించారని, ఫోన్‌ను ఉపయోగించనివ్వకుండా 4 ఏళ్లపాటు దుర్భర జీవితాన్ని గడిపేలా చేశారని పూనమ్ చెప్పింది.

చాలా మంచిదని
ఈ కష్టాలన్నీ నా మనస్తత్వాన్ని ప్రభావితం చేశాయని, నిరాశకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించానని పూనమ్ వెల్లడించింది. ఆమె తన వివాహాన్ని బ్రేక్ చేసుకున్న తర్వాత, తన జీవితాన్ని స్వేచ్ఛగా గడిపానని చెబుతూ ముగించింది. ఒక బ్యాడ్ రిలేషన్ చిక్కుకోవడం కంటే ఒంటరి జీవితం చాలా మంచిదని ఆమె వెల్లడించింది. .

10 గంటల నుంచి
తన పెద్ద ఇంట్లో తనకు నాలుగు అంతస్తులు ఉన్నాయని, అయితే సామ్ తనను వేరే గదిలో ఉండనివ్వలేదని తనతో పాటు అదే గదిలో ఉండమని బలవంతం చేశారని ఆమె చెప్పింది. తన ఇంట్లో తన ఫోన్‌ను తాకడానికి కూడా అనుమతించలేదని పూనమ్ చెప్పింది. షాకింగ్ వృత్తాంతాన్ని పంచుకుంటూ, నటి సామ్ తన 'మెదడు రక్తస్రావం'కి కారణమయ్యే విధంగా న అదే ప్రదేశంలో తన తలపై పదేపదే కొట్టేవాడని వెల్లడించింది. సామ్ ఉదయం 10 గంటల నుంచి మద్యం సేవించడం మొదలు పెట్టి అర్ధరాత్రి వరకు అలాగే ఉండేవాడని ఆమె తెలిపింది.


Click it and Unblock the Notifications











