భర్త లేకుండానే యంగ్ హీరోయిన్ గర్భవతి..ప్రెగ్నెన్సీ ఫోటోలతో రచ్చ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey). గతంలో అనేక సార్లు సోషల్ మీడియాలో ఎన్నో వివాదాలు క్రియేట్ చేసింది. పబ్లిక్ సిటీ కోసం ఎన్నో స్టంట్‌లు చేసింది పూనమ్ పాండే. గతంలో తన మరణం గురించి తప్పుడు ప్రచారం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ సారి ఏం చేసిందంటే?

Also Read
Dhurandhar 2 Day 13 Collections: 'ధురంధర్ 2' దూకుడు త‌గ్గిందా ? రణ్‌వీర్ మూవీకి 13 వ రోజు ఎన్ని కోట్లంటే?
Dhurandhar 2 Day 13 Collections: 'ధురంధర్ 2' దూకుడు త‌గ్గిందా ? రణ్‌వీర్ మూవీకి 13 వ రోజు ఎన్ని కోట్లంటే?

టి పూనమ్ పాండే పర్సనల్ లైఫ్ ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువే. 2020 సెప్టెంబర్ 1న ఆమె తన ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేతో వివాహం జరిగింది. ఈ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పూనమ్ పాండే తన భర్తపై వేధింపులు, దాడులు, బెదిరింపులు చేశాడని ఆరోపించింది. ఈ కేసుతో సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం సామ్ బాంబే బెయిల్‌పై విడుదల కాగా, ఈ దంపతులు తిరిగి మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకున్నారు.

Poonam Pandey Sparks Buzz With Pregnancy Pics Fans Suspect AI or Publicity Stunt
Recommended For You
1800 కోసం అలాంటి పనులు చేశా.. ఈ క్షణమైన చనిపోవడానికి సిద్దమే..
1800 కోసం అలాంటి పనులు చేశా.. ఈ క్షణమైన చనిపోవడానికి సిద్దమే..

ఇదిలా ఉండగా, అదే ఏడాది నవంబర్ లో మరో వివాదంలో పూనమ్ పాండే పేరు వెలుగులోకి వచ్చింది. అశ్లీల వీడియోల కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వరుస ఘటనలతో పూనమ్ పాండే వ్యక్తిగత జీవితం, వివాదాలు అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఇక గత రెండు సంవత్సరాలుగా తాను సింగిల్‌గా ఉంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆమె పలుమార్లు తెలిపింది. ఇలా ఆమె కెరీర్‌తో పాటు పర్సనల్ విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండటం గమనార్హం.

You May Also Like
'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో..' సుధీర్-కావ్య కెమిస్ట్రీ మామూలు కాదు...
'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో..' సుధీర్-కావ్య కెమిస్ట్రీ మామూలు కాదు...

ఇలా వివాదం ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. మార్చి 31న పూనమ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఆమె బేబీ బంప్‌తో కనిపించడంతో, నిజంగానే గర్భవతా? అనే సందేహాలు నెటిజన్లలో మొదలయ్యాయి. ఒక ఫోటోలో టీషర్ట్‌ను పైకి ఎత్తి బేబీ బంప్ చూపించగా, మరో ఫోటోలో కూడా బంప్ స్పష్టంగా కనిపించేలా పోజ్ ఇచ్చింది. అయితే క్యాప్షన్‌గా ఎలాంటి వివరణ ఇవ్వకుండా కేవలం బేబీ,పాల సీసా, గర్భిణీకి సంబంధించిన ఎమోజీలను మాత్రమే ఉపయోగించడం మరింత సందేహాలకు దారితీసింది.

ఈ పోస్టులు వైరల్ అవడంతో నెటిజన్లు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది నిజంగానే ఆమె గర్భవతై ఉంటుందేమోనని అనుకుంటే, మరికొందరు మాత్రం ఇది ఏప్రిల్ ఫూల్ స్టంట్ కా అని. అదనంగా, ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తయారై ఉండొచ్చని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Kalki 2: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. ఆ 20 నిమిషాలు మాత్రం గూస్‌బంప్స్..
Kalki 2: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. ఆ 20 నిమిషాలు మాత్రం గూస్‌బంప్స్..

ఇలాంటి అనుమానాలకు కారణం పూనమ్ గత చరిత్రే.. 2024 ఫిబ్రవరి 1న తాను సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిందని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడం పెద్ద సంచలనంగా మారింది. కానీ మరుసటి రోజే అది అవగాహన కోసం చేసిన స్టంట్ అని ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో పూనమ్ పాండేకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఈ తరహా స్టంట్ల ద్వారానే పెరిగింది. ముఖ్యంగా 2011 క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో 'భారత్ గెలిస్తే నగ్నంగా కనిపిస్తా' అన్న ప్రకటనతో ఆమె ఒక్కసారిగా మీడియాలో హైలైట్ అయ్యింది. తర్వాత కూడా సెమీ-న్యూడ్ ఫోటోలు, బోల్డ్ కంటెంట్‌తో ఆమె పేరు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

2 ఏళ్ల కఠోర సాధన.. రోజుకు 32 కి.మీ. రన్నింగ్.. 23 కేజీలు వెయిట్ లాస్
2 ఏళ్ల కఠోర సాధన.. రోజుకు 32 కి.మీ. రన్నింగ్.. 23 కేజీలు వెయిట్ లాస్

ఇంకా 2017లో ఆమె ప్రారంభించిన 'పాండే యాప్' కూడా అడల్ట్ కంటెంట్ కారణంగా భారీ చర్చకు దారితీసింది. ఈ యాప్ ద్వారా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక పూనమ్ బుల్లి తెర ప్రేక్షకులకు కూడా దగ్గరే. లాక్ అప్: బాదాస్ జైలు, అత్యాచారి ఖేల్! అనే రియాలిటీ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించింది. ఈ షోను కంగనా రనౌత్ హోస్ట్ చేయగా, మునవర్ ఫరుకీ విజేతగా నిలిచాడు.

నా బట్టలు నా ఇష్టం.. ఏం వేసుకోవాలో తెలుసు.. ప్రియాంక జైన్ ఆగ్రహం!
నా బట్టలు నా ఇష్టం.. ఏం వేసుకోవాలో తెలుసు.. ప్రియాంక జైన్ ఆగ్రహం!

మొత్తంగా చూస్తే, పూనమ్ పాండే తన సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా స్టంట్లు, వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజా "ప్రెగ్నెన్సీ" ఫోటోలు కూడా నిజమా? లేక మరో పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? అన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా, మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతుంది.

More from Filmibeat

Read more about: poonam pandey bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X