twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

    |

    ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న నటి పూర్ణ అలియాస్ సామ్నా కాశీం. చాలా కాలంగా తెలుగులో సినిమాలు, షోలు చేస్తూ హవాను చూపిస్తోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే దుబాయ్‌కు చెందిన ఓ బడా బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుంది. ఇది జరిగి ఎన్నో రోజులు కాకముందే హీరోయిన్ పూర్ణ ఓ భారీ మోసాన్ని బయట పెట్టింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్ట్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందో చూడండి!

    అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్

    అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్

    కేరళకు చెందిన పూర్ణ 'శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే 'సీమటపాకాయ్', 'సిల్లీ ఫెలోస్', 'అదుగో', 'రాజుగారి గది', 'మామ మంచు అల్లుడు కంచు' సహా ఎన్నో చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయింది.

    హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!

    బిజినెస్‌మ్యాన్‌తో పూర్ణ పెళ్లి

    బిజినెస్‌మ్యాన్‌తో పూర్ణ పెళ్లి

    హీరోయిన్ పూర్ణ వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే.. దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన తర్వాత వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో అరబిక్ పద్దతిలో వివాహం చేసుకున్నారు.

    పెళ్లి తర్వాత కెరీర్ కంటిన్యూ

    పెళ్లి తర్వాత కెరీర్ కంటిన్యూ

    బడా బిజినెస్‌మ్యాన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ పూర్ణ చాలా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. అదే సమయంలో తన కెరీర్‌ను ముందుకు సాగిస్తానని కూడా పరోక్షంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆమె షూట్‌లలో కూడా పాల్గొనబోతుంది. ఇక, ఇప్పుడు పూర్ణ.. నాని 'దసరా' మూవీలో నెగెటివ్ రోల్ చేస్తోంది.

    Yashoda Twitter Review: యశోదకు పాజిటివ్ టాక్.. ఆ సీన్స్‌లో అదరగొట్టిన సమంతYashoda Twitter Review: యశోదకు పాజిటివ్ టాక్.. ఆ సీన్స్‌లో అదరగొట్టిన సమంత

    పెళ్లి కానుక గురించి వార్తలు

    పెళ్లి కానుక గురించి వార్తలు

    జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో హీరోయిన్ పూర్ణ వివాహం దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అదే సమయంలో వీళ్ల వివాహం గురించి, అది జరిగిన పద్దతి గురించి, కానుకల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు అందించాడని, వాటి వివరాలతో సహా ఎన్ని విషయాలు బయటకొచ్చాయి.

    పూర్ణ భర్త పేరుతో మోసాలు

    పూర్ణ భర్త పేరుతో మోసాలు

    దుబాయ్‌లోని బడా వ్యాపారవేత్తల్లో ఒకరైన షానిద్ ఆసిఫ్ అలీ.. పూర్ణను వివాహం చేసుకున్న తర్వాత మరింత పాపులర్ అయ్యారు. దీంతో ఆయన ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా తన వ్యవహారాలతో బిజీగా గడుపుతోన్న షానిద్ ఆసిఫ్ అలీ పేరిట ఓ భారీ మోసం బయటకు వచ్చింది. దాన్ని నటి పూర్ణనే సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొచ్చి షాకిచ్చింది.

    షర్ట్ విప్పేసి అరాచకంగా ప్రణిత: ఆమె ఓ బిడ్డకు తల్లంటే నమ్ముతారా!షర్ట్ విప్పేసి అరాచకంగా ప్రణిత: ఆమె ఓ బిడ్డకు తల్లంటే నమ్ముతారా!

    స్క్రీన్ షాట్ షేర్ చేసి మరీ

    స్క్రీన్ షాట్ షేర్ చేసి మరీ

    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వాట్సాప్ నెంబర్ డీటేల్స్‌తో కూడిన పిక్ షేర్ చేసింది. ఇందులో ఆమె భర్త ఫొటో డీపీగా ఉంది. ఇక, దీనికి 'పైనున్న నెంబర్‌తో నా భర్త పేరిట కొందరు మోసాలు చేస్తున్నారు. దీన్ని నేను తాజాగా గుర్తించాను. దీని ద్వారా వాళ్లు చాలా మందిని కాంటాక్ట్ చేసి మోసం చేస్తున్నారు' అని చెప్పింది.

    మాకు సంబంధం లేదంటూ

    మాకు సంబంధం లేదంటూ

    ఇదే పోస్టులో హీరోయిన్ పూర్ణ 'షానిద్ పేరుతో ఎవరైనా మీకు వాట్సాప్ కాల్ చేస్తే అస్సలు స్పందించకండి. దీనిద్వారా ఎవరైనా నష్టపోతే దానికి మేము బాధ్యులం కాదు' అంటూ నెటిజన్లను హెచ్చరించింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో పెళ్లైన కొత్తలోనే పూర్ణకు ఇలాంటి అనుభవం ఎదురవడంపై ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

    English summary
    Actress Poorna Gets Married To Her Boyfriend Shanid asifali Recently. Now She Gave Clarity about Big Fraud with Her Husband Name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X