మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఫోటో వైరల్

ప్రణీతా సుభాష్. చూడచక్కని అందంతో, కలువల్లాంటి కల్లు, వైట్ స్కీన్‌టోన్‌తో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న ఈ కన్నడ కస్తూరికి ఎందుకో స్టార్ డమ్ దక్కలేదు. కరోనా సమయంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడిన ప్రణీత ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రీసెంట్‌గా మరోసారి గర్భం దాల్చిన ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ.. బేబీ బంప్‌తో లాస్ట్ పిక్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్లాక్‌బస్టర్ మూవీ పోకిరికి కన్నడ వెర్షన్ పోర్కీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీతా సుభాష్.. బావతో తెలుగు వారిని పలకరించింది. అందం, అభినయం పర్ఫెక్ట్‌గా ఉన్నా కానీ ఎందుకో సెకండ్ లీడ్‌గానే ఆమెకు అవకాశాలు దక్కాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ అత్తారింటికి దారేదిలో ఛాన్స్ కొట్టేసినా అది కూడా సెకండ్ హీరోయిన్ కావడంతో బాగా డిజప్పాయింట్ అయ్యింది. అయినప్పటికీ పట్టు వదలకుండా అవకాశాల కోసం ట్రై చేసింది.

power star pawan kalyan s attarintiki daredi movie actress pranitha subhash delivered her second baby here s the details

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం నటించిన పాండవులు పాండవులు తుమ్మెద, మహేశ్ బాబు బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాలు ప్రణీతకు మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి హంగామా-2తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారామె. భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపు దాల్చినప్పుడు తన మంచి మనసును చాటుకున్నారు ప్రణీత. లాక్‌డౌన్ పీరియడ్‌లో బెంగళూరులో చిక్కుకుపోయిన వలస కూలీలు, పేదలకు తన వంతు సాయం చేసి రియల్ స్టార్ అనిపించుకున్నారు. స్వయంగా ఇంట్లో ఆహారం వండుకొచ్చి వాటిని అందజేశారు.

లాక్‌డౌన్ సమయంలోనే బెంగళూరుకు చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్ నితిన్ రాజును ప్రణీత పెళ్లాడి సైలెంట్‌గా షాకిచ్చారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో 2021 జూన్ 1న వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన ప్రణీత. గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫోటోలు, వీడియోల రూపంలో మహిళలకు విలువైన సమాచారాన్ని అందజేశారు. ఈ క్రమంలోనే 2022 జూన్ 11న పండంటి ఆడబిడ్డకు ప్రణీత జన్మనిచ్చారు.

power star pawan kalyan s attarintiki daredi movie actress pranitha subhash delivered her second baby here s the details

తన భర్త, కూతురితో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రణీత.. సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్‌లో ఉంటున్నారు. ఇటీవల ప్రణీత రెండోసారి గర్భంగా దాల్చారు. కొద్దిరోజుల క్రితం బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ప్రణీత బేబీ షవర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో తన కూతురిని ఎత్తుకుని భర్తతో కలిసి కేక్ కట్ చేసి, తన ఆనందాన్ని పంచుకుంది.

డెలివరీ డేట్ దగ్గరపడటంతో చివరిసారిగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్న ప్రణీత.. ఆ వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లుగా తెలుస్తోంది. గురువారం ప్రణీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ, భర్తతో ఉన్న ప్రణీత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: pranitha subhash movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X