బోల్డ్ బ్యూటీ షాకింగ్ ఫ్యాక్ట్ .. ఇలాంటి వాటికి ఎవరైనా భయపడతారా?
మాములుగా మంచి గ్లామరస్ అండ్ బోల్డ్ హీరోయిన్స్ అంటే చాలా మంది హిందీ ఇండస్ట్రీలోనే ఉంటారు అనుకుంటారు. కానీ మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలోనూ కొందరు బోల్డ్ హీరోయిన్స్ తమ అంద చందాలతో అలరిస్తూ ఉంటారు. ఆ హీరోయిన్స్ లో తమిళ హాట్ సెన్సేషన్ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా ఒకరు. కాగా మాళవిక సోషల్ మీడియాలో చేసే హాట్ షో అంతా ఇంతా కాదు.
ఎప్పటికప్పుడు హీటెక్కించే ఫొటోలతో అలరించే ఈ బోల్డ్ హీరోయిన్ తమిళ్ లో పలు సినిమాలు కూడా చేసింది. అయితే ఇన్ని రోజులు తాను కేవలం సింపుల్ రోల్స్ లేదా స్కిన్ షోకి మాత్రమే పరిమితం అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కోలీవుడ్ విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా వచ్చిన తంగళాన్ లో అందరికీ తనలోని నటిని చూపించి సర్ప్రైజ్ చేసింది.

ఇలా పెర్ఫార్మెన్స్‌లోనూ మంచి మార్కులు వేయించుకున్న మాళవిక .. సోషల్ మీడియాలో కూడా ఒకింత ఎక్కువ యాక్టీవ్ గానే కనిపిస్తుంది. ఈ క్రమంలో మాళవిక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమెకి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటి అన్నింటికి కూడా చలాకీగా సమాధానాలు ఇచ్చింది. అయితే వీటిలో ఆమెకి ఎదురైనా ఓ ప్రశ్నకి మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చారు మాళవిక.
ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే తనని బాగా భయపెట్టే అంశం ఏది అని ఎక్స్‌లో యూజర్ ప్రశ్నించాడు. జనరల్‌గా ఆడవాళ్ళకి పాములో, జెర్రులో లేకపోతే బల్లులు ఇక యూనివర్సల్ గా అయితే బొద్దింక అంటే అంటారు. కానీ మాళవిక వీటిలో ఆ ఒక్క పేరు కాదు కదా భయానక క్రూర మృగాలా పేర్లు కూడా చెప్పలేదు.
తనకి ఎగిరే సీతాకోక చిలుకలు అంటే ఎంతో భయం అని చెబుతుంది. అవును మీరు విన్నది నిజమే.. ఈ బోల్డ్ బ్యూటీకి సీతాకోక చిలుకలు అంటే ఎంతో భయం అట. ఇది వినడానికి మీ అందరికీ వింతగా ఉండవచ్చు కానీ ఇదే నిజం. నాకెందుకో సీతాకోక చిలుకలు అంటే చాలా భయం అని మాళవిక చెప్పుకొచ్చింది. ఆమె నుంచి ఊహించని ఆన్సర్ విన్న తన ఫాలోవర్స్ ఇలాంటి వాటికి కూడా భయపడతారా అనుకుంటున్నారు.
ఇది మాత్రం నిజంగానే ఒక స్ట్రేంజ్ ఆన్సర్ అని చెప్పి తీరాలి. ఇవి పక్కన పెడితే ఈ బోల్డ్ బ్యూటీ తెలుగులో మొట్టమొదటి సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భారీ చిత్రం "ది రాజా సాబ్" లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమెతో పాటుగా నిధి అగర్వాల్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు మారుతీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











