#Prabhas21పై దీపిక పదుకోన్ వివాద ట్వీట్.. భగ్గుమంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

సాహో, రాధేశ్యామ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ చిత్రం కోసం దీపికా పదుకోన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. #Prabhas21 పేర్కొంటున్న ఇంకా పేరు పెట్టని చిత్రం దీపికాను వివాదంలోకి లాగేసింది. దీపిక వ్యవహరించిన తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇంతకు ఈ వ్యవహారంలో వివాదం ఏమిటంటే..

Recommended Video

#Prabhas21 : Deepika Padukone To Join Prabhas In Nag Ashwin's Film
దీపికపై నాగ్ అశ్విన్ క్రేజీ ట్వీట్

దీపికపై నాగ్ అశ్విన్ క్రేజీ ట్వీట్

ప్రభాస్‌తో దీపిక పదుకోన్ నటిస్తున్నారనే విషయంపై నాగ్ అశ్విన్ ట్విట్టర్‌లో స్పందించారు. దీపిక పదుకోన్.. ప్రాజెక్ట్‌కు తగినట్టు నటీనటులు బాగా మ్యాచ్ అయినట్టు నేను భావిస్తున్నాను. ఈ కథ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడూ మీ క్యారెక్టర్‌ను, మీతో కలిసి ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనే ఆతృత మొదలైంది. తప్పుకుండా ఆ పాత్ర అందర్నీ సంతోషంలో మొంచెత్తడం ఖాయం అని నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 దీపిక వివాదాస్పద ట్వీట్

దీపిక వివాదాస్పద ట్వీట్

ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటిస్తున్నారనే విషయాన్ని ఓ జాతీయ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అందులో ఇంకా పేరు పెట్టని చిత్రంలో దీపిక నటిస్తున్నారు అనే హెడ్‌లైన్‌తో వార్తను ప్రచురించారు. ఆ కథనంపై దీపిక పదుకోన్ స్పందించిన తీరును అభిమానులు తప్పుపడుతున్నారు. ఆమె అహంభావానికి ఇది నిదర్శనం అనే పేర్కొంటున్నారు.

ప్రభాస్ 21 కాదు.. ఇంకా పేరు పెట్టలేదు

ప్రభాస్ 21 కాదు.. ఇంకా పేరు పెట్టలేదు

ఇంకా పేరు పెట్టని సినిమా అనే విషయంపై ట్విట్టర్‌లో దీపిక పదుకోన్ స్పందిస్తూ.. ఆ పత్రిక పేరు పెట్టి.. మీరు స్టోరిని ప్రచురించినందుకు థ్యాంక్స్. కానీ ఆ సినిమాకు #Prabhas21 అని పేరు పెట్టలేదు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో 21వ చిత్రం. ఇది హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. ఈ విషయాన్ని గుర్తించండి.. థ్యాంక్యూ అంటూ కొంత ఘాటుగా దీపిక స్పందించింది.

నీవేమైనా గుడ్డిదానివా?

నీవేమైనా గుడ్డిదానివా?

అయితే ఇంకా పేరు పెట్టని సినిమా క్లియర్‌గా రాసినా గానీ దీపికా పదుకోన్ గందరగోళం సృష్టించేలా వ్యాఖ్యలు చేయడంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు. నీవేమైన గుడ్డిదానివా;? అంత క్లియర్ చెప్పారు. ఇంత షో పనికి రాదు. అన్నా ఇలాంటి కథలు సెట్స్‌లో పడితే బాగుండదు అంటూ నాగ్ అశ్విన్‌కు నెటిజన్ సూచించారు. ఓకవేళ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే నా వల్లే అని ఫీలవుతుందేమో అని మరో నెటిజన్ పేర్కొన్నారు.

 నీ వేషాలు ఇక్కడ నడువవు

నీ వేషాలు ఇక్కడ నడువవు

దీపిక ట్వీట్‌పై కొందరు నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఇలాంటి వేషాలు దక్షిణాది ఇండస్ట్రీలో నడువవు. ప్రభాస్ పేరు మీదే చెల్లుబాటు అవుతుంది. దీపికను చూసి ఎవరూ థియేటర్‌కు రారు. ప్రభాస్‌ను చూసే సినిమాకు వస్తారు అంటూ కామెంట్లు పెట్టారు. మరి కొందరు ఆమె పీఆర్‌ను మెయింటెన్ చేయడంలో దిట్ట. ఇలాంటివి ఎన్నో చూడాలో అంటూ కామెంట్లు విసురుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X