ప్రభాస్ హీరోయిన్‌కు ఘోర అవమానం.. అసభ్యకరంగా తాకుతూ..
అభిమాని నటులపై ఇష్టం ఉండాలి. కానీ, అది హద్దులు దాటితే ప్రమాదంగా మారుతుందన్న విషయం ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపించబడింది. అభిమానుల అత్యుత్సాహం వల్ల పలుమార్లు నటీనటులు అసౌకర్యానికి గురైన సందర్భాలు మనం చూశాం. తాజాగా అదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) చేదు అనుభవానికి గురైంది. ఓ సినిమా ఈవెంట్‌లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్' ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని 'సహన సహన' అనే మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట లాంచ్ ఈవెంట్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ మొత్తం ప్రశాంతంగా సాగినా... అసలు సమస్య ఈవెంట్ ముగిసిన తర్వాత మొదలైంది.

సాంగ్ లాంచ్ కార్యక్రమం పూర్తయ్యాక నిధి అగర్వాల్ తన కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఒక్కసారిగా వందలాది మంది అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆ హీరోయిన్ తో సెల్ఫీలు దిగాడానికి ఎగబడ్డారు. కొందరు అభిమానులు హద్దులు దాటి ఆమెను తాకేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జనసందోహం ఒక్కసారిగా ఆమెపై పడటంతో నిధికి క్షణాల పాటు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. కారువరకు వెళ్లడం కష్టంగా మారింది.
ఈ పరిస్థితిని గమనించిన బాడీగార్డులు వెంటనే రంగంలోకి దిగారు. ఎంతో శ్రమించి, అభిమానులను కంట్రోల్ చేస్తూ.. ఆమెను సురక్షితంగా కారువరకు తీసుకెళ్లారు. చివరకు కారులో కూర్చోగానే ఆమె ఊపిరి పీల్చుకున్నట్లు..'మై గాడ్' అని అనుకున్నట్లు వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో సెలబ్రిటీల సెక్యూరిటీ, సినిమా ఈవెంట్ల నిర్వహణపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది అభిమానం కాదు.. ఇది వేధింపులు. హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు'అంటూ సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పలువురు నెటిజన్లు కూడా ఈవెంట్ నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంత చిన్న ప్రదేశంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు నిధి అగర్వాల్ గానీ, 'ది రాజా సాబ్' మూవీ టీమ్ గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ ఘటన మరోసారి సెలబ్రిటీల భద్రతపై స్పష్టమైన మార్పులు అవసరమన్న విషయాన్ని గుర్తు చేస్తోంది.
నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్'తో హీరోయిన్‌గా పరిచయమై, తెలుగులో 'సవ్యసాచి', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'ఇస్మార్ట్ శంకర్' ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు'లో కనిపించిన నిధి.. త్వరలో ప్రభాస్‌తో 'ది రాజా సాబ్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











