బాయ్ ఫ్రెండ్ తో నైట్ పార్టీ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ప్రభాస్ బ్యూటీ..

సినిమా సెలబ్రిటీల జీవితాలు మనం అనుకున్న ఈజీగా ఉండదు. వారు ఎంత డబ్బు, పేరు సంపాదించుకున్న ప్రైవేట్ స్పేస్ మాత్రం చాలా తక్కువ. వారు ఏ చిన్న పనిచేసినా.. వారు ఎవరితో అయినా కలిసి తిరిగినా.. మీడియా కంటపడితే చాలు ఇట్టే వైరలవుతోంది. మరుక్షణంలో వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎక్కడలేని రూమార్స్ క్రియేట్ అవుతుంటాయి. లేనిపోని సోర్టీలు వైరలవుతుంటాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ తన తన బాయ్ ఫ్రెండ్ తో నైట్ డిన్నర్ కు వెళ్లింది. ఈ సమయంలో మీడియాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో ఆ హీరోయిన్ అతడితో రిలేషన్ కొనసాగిస్తున్నాడంటూ లేనిపోని రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ బాలీవుడ్ భామ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తన నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక తెలుగులో 'నేనొక్కడినే' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి కృతి ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన 'ఆదిపురుష్‌'లో సీతగా నటించింది. కానీ, హిట్ అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ దూరమై బాలీవుడ్ చెక్కేసింది.

Prabhas Herione Kriti Sanon spotted with rumoured boyfriend Kabir Bahia at dinner date

ఇక బాలీవుడ్ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల 'దో పత్తీ'(Do Patti)మూవీతో హిట్ అందుకుంది. ఈ అమ్మడు సినిమాలు, యాడ్స్‌ల్లో నటిస్తూ బిజీగా బిజిగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులు ఈ అమ్మడు తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ కబీర్ బహియ అనే వ్యాపారవేత్త ప్రేమాయణం కొనసాగిస్తుందని బీ టౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ జంట ముంబైలోని ఓ రెస్టారెంట్లో నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్తుండగా మీడియా కంటబడ్డారు. ఈ క్రమంలో కబీర్ సిగ్గుతో మొఖం చాటేశాడు. హీరోయిన్ కృతి సనన్ మాత్రం మీడియాకు ఫోజులిచ్చింది.

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కృతి సనన్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుంది. ఆమె ఆఫ్ షోల్డర్ డెనిమ్ డ్రెస్ వేసుకుంది.ఓపెన్ హెయిర్ తో తన క్యూట్ లుక్ తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ సమయంలో కబీర్ సాధారణ లుక్‌లో కనిపించాడు. ఆ వీడియోలో కబీర్ కూడా చాలా సిగ్గుపడుతున్నట్లు కనిపించాడు. అతడు కెమెరాకు కనబడకుండా తన ముఖాన్ని దాచుకోవడం చూడవచ్చు. దీంతో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి బయటపడింది. కానీ, కృతి లేదా కబీర్ లు ఈ విషయంపై ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.

Prabhas Herione Kriti Sanon spotted with rumoured boyfriend Kabir Bahia at dinner date

కబీర్ బహియా ఎవరు ? మరోవైపు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కబీర్ బహియా ఎవరు అనే విషయాన్ని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. 2020లో స్థాపించిన వరల్డ్ వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ అనే ఎయిర్ లైన్ సంస్థ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ కబీర్ బహియా. బహియా తండ్రి పేరు కుల్జిందర్ బహియ. యూకేకి చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సౌతాల్ ట్రావెల్ కు ఆయన ఓనర్. ఇక బహియా కుటుంబానికి సుమారు రూ. 4000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: kriti sanon kabir bahia bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X