Disha Patani కనిపించి.. కనిపించని చోట దిశా పటానీ టాటూ.. ప్రభాస్ హీరోయిన్ కథ మూమూలుగా లేదుగా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని, హీరో టైగర్ ష్రాఫ్ మళ్ళీ ఒక్కటయ్యారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దిశ కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ చేతి మీద ఉన్న టాటూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బార్బీ బొమ్మ దిశా పటాని తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయట కనిపించింది. అయితే ఈ క్రమంలో అతని చేతి మీద ఉన్న టాటూ సంచలనగా మారింది. దిశా బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ టాటూ సంగతులపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
తాజాగా దిశా పటాని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కనిపించడం, అతని చేతిపై టాటూ ఉండడం సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. దిశా పటాని రీసెంట్ గా బాంద్రాలోని సీక్వెల్ అనే ఓ రెస్టారెంట్ లో దర్శనమిచ్చింది. ఆమెతో పాటే తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కూడా ఆ రెస్టారెంట్ కు వచ్చాడు.

ఈ జంటతో పాటే మరో బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్ కూడా అక్కడ దర్శనమిచ్చింది. ఇక ముగ్గురూ కలిసి సదరు రెస్టారెంట్ ఎదుట ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. అయితే అందరూ చెప్పుకుంటున్న దిశా పటాని కొత్త ప్రియుడు అలెగ్జాండర్ తన కండలు తిరిగిన చేతులపై ఓ టాటూను వేసుకోవడం విశేషం.
టాటూలో విశేషం ఏముంటుంది అంటే అది దిశా పటాని ముఖంతో వేసుకున్న టాటూ. చాలా రోజులుగా అలెగ్జాండర్ వేసుకున్న టాటూ ఎవరిది ? అనే సందేహం బాలీవుడ్ ను తొలిచేస్తుంది. అయితే రీసెంట్ గా దిశా స్వయంగా అలెక్స్ వేసుకుంది తన టాటూనే అంటూ చెప్పుకొచ్చింది.
అలెక్స్ లాంటి ఫ్రెండ్ దొరకడం తన అదృష్టం అంటూ సోషల్ మీడియాలో ఆ టాటూ ఫోటోను స్పెషల్ గా పోస్ట్ చేసింది. అయితే ఇంతకీ వీళ్లిద్దరూ జస్ట్ ఫ్రెండ్సా, లేక డేటింగ్ చేస్తున్నారా అనే కన్ఫ్యూజన్ మాత్రం వీడట్లేదు. వాళ్లు కూడా అ సస్పెన్స్ కి తెర దించట్లేదు.
కానీ ఎక్కడ చూసినా దిశా అలెగ్జాండర్ తో కలిసి కనిపిస్తూ ఉండడంతో వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు అని ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్. కాగా గతంలో దిశా పటాన్ని, బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ షాప్ తో ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే కొంతకాలం క్రితం వీళ్ళిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా బడే మియాన్ చోటే మియాన్ ప్రమోషన్స్ లో టైగర్ ష్రాఫ్ ఇచ్చిన సమాధానం మళ్లీ ఈ జంట తిరిగి ఒకటయ్యారు అనిపించేలా చేసింది.
ప్రస్తుతం మీ రిలేషన్షిప్ ఏ దిశలో ఉంది? అనే ప్రశ్నకు టైగర్ స్పందిస్తూ నాకు జీవితంలో ఒకే ఒక దిశ ఉంది అంటూ దిశా గురించి హింట్ ఇచ్చినట్టుగా మాట్లాడారు. దీంతో మళ్లీ వీరిద్దరూ ఒక్కటైపోయారని సంతోష పడేలోపే అలెగ్జాండర్ తో కలిసి ఇలా దిశ సందడి చేస్తుండడం ఆమె అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది.
ప్రేమలో ఉంది హీరోతో అయితే బాయ్ ఫ్రెండ్ టాటూ వేయించుకోవడం ఏంటి విడ్డూరంగా.. ఇదెక్కడి గోల అంటూ తలలు పట్టుకుంటున్నారు. కాగా దిశా ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీలో హీరోయిన్ గా కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











