30 కోట్ల ఇల్లు అమ్మేసి.. ఆ రేంజ్ కారు కొన్న.. ప్రభాస్ హీరోయిన్

సినిమా అలాగే రాజకీయాల్లో కూడా రాణిస్తున్న అతి తక్కువమంది సెలెబ్రెటీస్ లో చూసుకుంటే ఎక్కువగా ఇక్కడ కూడా మేల్ డామినేషన్ కనిపించొచ్చు. కానీ హీరోయిన్స్ పరంగా మాత్రం చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాగే అందులోని యుక్త వయస్సులోనే రాజాకీయాల్లోకి వచ్చేసిన హీరోయిన్స్ అయితే దాదాపు శూన్యం అనే చెప్పొచ్చు.

కానీ వీటికి అతీతంగా అటు సినిమాల్లోని ఇటు రాజకీయాల్లో కూడా అద్భుతమైన మార్క్ వేసుకున్న స్టార్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బాలీవుడ్ కాంట్రవర్సియల్ నటి కంగనా రనౌత్ అని కాగా కంగనా రనౌత్ మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో "ఏక్ నిరంజన్" సినిమాలో కనిపించి అక్కడ నుంచే నోటెడ్ అయ్యిపోయింది.

prabhas heroine kangana ranaut sold her house but bought a costly car

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకే వెళ్ళిపోయి అనతి కాలంలోనే మంచి ఫేమ్ ని తెచ్చుకుని బిజీగా మారింది. ఇన్క్ అక్కడ స్టార్ హీరోస్ తో కొన్ని కాంట్రవర్సీలు ఇలా చాలానే రచ్చ లేపి కంగనా కాంట్రవర్సియల్ నటిగా అయితే మారిపోయింది. కాగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండగా ఆమె నటించిన అది కూడా తానే అవైటెడ్ చిత్రం "ఎమెర్జెన్సీ" రిలీజ్ తో కుస్తీలు పడుతుంది.

ఈ సినిమా ఎప్పుడో సెప్టెంబర్ 6నే థియేటర్స్ లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటికీ కేసులు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో దీనితో పాటుగా మరో రకంగా కూడా కంగనా వార్తల్లోకి ఎక్కింది. తన దగ్గర ఉన్నటువంటి 30 కోట్లకి పైగా ఖరీదైన ఇంటిని పలు కారణాలు చేత అమ్ముకోవాల్సి వచ్చింది అనే వార్తలు షాకింగ్ గా మారాయి. కంగనా పరిస్థితి ఇంతలా మారిపోయిందా అంటూ చాలా మంది అనుకున్నారు.

కానీ ఆ ఇల్లు అమ్మేశాక ఒక ఖరీదైన కారును కొనేసి కంగనా అందరికీ మరో ట్విస్ట్ ని ఇచ్చింది. కార్స్ లో రేంజరోవర్ అనే కారు తెలియని ఉండకపోవచ్చు. కాగా ఇందులోనే ఓ లేటెస్ట్ మోడల్ ని కంగనా కొనేసిందట. అది కూడా దీని ధర రెండున్నర కోట్ల నుంచి 4 కోట్ల మధ్యలో ఉంటుంది అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీనితో అలా ఇల్లు అమ్ముకోవడం ఇప్పుడు కారు కొనుక్కోవడం ఏంటో అని చాలా సందర్భాల్లో ఆమె చేసే కామెంట్స్ తరహాలోనే కన్ఫ్యుజింగ్ గా ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. కాగా ఇపుడు కంగనా అయితే ఈ కారుని తన పర్శనల్ పనులకి ఆఫీస్ కార్యకలాపాలకు వాడుకోవడానికి కొనుగోలు చేసిందట.

అలాగే దీనితో పాటుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈమె సామాన్య ప్రజలతో కూడా మమేకం అవుతూ కనిపిస్తుంది. ఇంకో పక్క తన వాయిదా పడ్డ ఎమెర్జెన్సీ చిత్రం పలు కండిషన్స్ తో కొన్ని సీన్స్ ని తీసేయాలని న్యాయస్థానం చెబితే వాటికి కంగనా ఓకే చెప్పి సినిమాని రిలీజ్ చెయ్యాలని కోరుకుంటుందట. సో ఇలా రిలీజ్ కి త్వరలోనే రాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏంటి ఎప్పుడు అనే వివరాలు ఇంకా రివీల్ కావాల్సి ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X