పెళ్లికి రెడీ అయిపోయిన ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్... 10 ఏళ్లుగా డేటింగ్... బయటపడ్డ సీక్రెట్!
ఇండస్ట్రీలో హీరోయిన్లు, హీరోలు ప్రేమలో పడటం సహజమే. ఇక మరో భామ 10ఏళ్లుగా ప్రేమలో పడి.. ఇప్పుడు బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు.. మిస్టర్ ఫర్ ఫెక్ట్ ప్రభాస్ హీరోయిన్ తాప్సీ పోన్ను. ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు.. పదేళ్ల పాటు డేటింగ్ చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ఈ భామ. ఆ వివరాల్లోకి వెళితే...
హీరోయిన్ తాప్సీ పొన్ను.. తెలుగులోకి ఝుమ్మంది నాదం సినిమాతో అడుగుపెట్టింది. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తాప్సీ నటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ భామ. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సును కొట్టేసింది.

ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రంలో ప్రభాస్ ఫ్రేయసిగా, గర్ల్ ఫ్రెండుగా నటించింది. ఇక ఈ భామకు మిస్టర్ ఫర్ ఫెక్ట్ మంచి పేరును తీసుకువచ్చింది. ఇక తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ... బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి పాపులారిటినీ దక్కించుకుంది. వరుసగా సినిమాలు చేసి... హిట్ కొట్టింది.
ఇదిలా ఉంటే.. తాప్సీ పన్ను డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వార్తలు వచ్ాచయి. అయితే తన ప్రేమ గురించి ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు ఈ భామ. తాజాగా ఈ భామ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఓపెన్ అయిపోయింది. తన ప్రేమ గురించి బయటపెట్టి షాకిచ్చింది.
దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నట్లు తన సీక్రెట్ చెప్పుకువచ్చింది. దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడిందని వెల్లడించింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చిందని తెలిపింది.. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నానని... అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదని చెప్పుకువచ్చింది.

మాథిస్ బో వల్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకువచ్చిన ఈ భామ... ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని తెలిపింది. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదని వెల్లడించింది. ఇక ఈ భామ ప్రేమ విషయం.. పదేళ్ల తర్వాత ఇప్పుడు బయటపెట్టడం వెనకు ఒక రీజన్ ఉందని అంటున్నారు ఫ్యాన్స్.
తాప్సీ త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతుందని అందుకే ఇప్పుడు చెప్పిందని అంటున్నారు. ఇక తాప్సీ... ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13ఏళ్లు దాటింది. గతేడాదిలో షారుక్ ఖాన్ తో 'డంకీ' చిత్రంలో తాప్సీ నటించి మెప్పించింది.. ప్రస్తుతం వహ లడ్‌కీ హై కహా, ఫిర్ అయీ హసీన్ దిల్‌రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు చేస్తుంది తాప్సీ. చూడాలి మరి ఈ భామ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందో.


Click it and Unblock the Notifications











