చంపేస్తానంటూ బెదిరింపులు.. కేసు పెట్టిన ప్రభాస్ హీరోయిన్
రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. అలాగే సోషల్ మీడియా వినియోగం కూడా విపరీతమైపోయింది. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలను ఉన్నాయో అంతకంటే ఎక్కువ దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మారుతున్న టెక్నాలజీని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. చంపేస్తామంటూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలా తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ని టార్గెట్ చేస్తూ.. కొంతమంది ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో లూక్కెయ్యండి?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రాజా సాబ్, హరి హర వీరమల్లు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూన్న బ్యూటీ నిధి అగర్వాల్. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో నిధి అగర్వాల్ సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆకతాయిలు హీరోయిన్ నిధి అగర్వాల్ ను చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారట. తొలుత ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా విడిచిపెట్టిందట. కానీ, రోజుకు వారీ కామెంట్స్ పెరిగిపోవడం. ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారంట. దీంతో ఈ అమ్మడు సైబర్ పోలీసులను ఆశ్రయించింది.

తనపై హత్యా బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. తాను ఆకతాయిలా వేధింపులతో మానసికంగా కూడా చాలా ఒత్తిడికి లోనయ్యానని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రధానంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నాడని తన కంప్లైంట్ లో పేర్కొంది. ఆ వ్యక్తి బెదిరింపుల కారణంగా తాను మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యానని తెలిపింది. నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. హీరోయిన్ నిధి అగర్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నట్లు తెలుస్తోంది..
ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ఓ వైపు.. ప్రభాస్ రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతుంది. మరో వైపు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ కోసం ఏపీకి వెళ్లి వస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











