‘సలార్’లో శృతి హాసన్ పాత్ర ఇదే: ప్రభాస్ కోసం అలాంటి ప్లాన్ వేసిన దర్శకుడు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ప్రకటించిన అతడు.. అన్నింటి కంటే ముందుగానే మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే.. పాన్ ఇండియా చిత్రం 'సలార్'. KGF అనే మూవీతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దీన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ సింగరేణి బొగ్గు గనుల్లో విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందుతోన్న 'సలార్'లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె చేసేది ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్ పాత్ర అట. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ రోల్ సినిమా అంతా ట్రావెల్ చేస్తుందని అంటున్నారు. అంతేకాదు, శృతి హాసన్ పాత్ర విషయంలో ఓ ట్విస్ట్ కూడా ఉంటుందని.. అదే సినిమాను మలుపు తిప్పుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆమె గ్లామర్‌గా కనిపించడంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌ను కూడా చూపించే ఆస్కారం ఉందని సమాచారం.

భారీ స్థాయిలో రాబోతున్న 'సలార్' సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్‌లతో కనిపిస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ కోసం గుజరాత్‌లో ఓ భారీ సెట్‌ను సైతం రూపొందించారు. ఏప్రిల్ చివరి వారంలో అది ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కరోనా ప్రభావంతో అది కాస్తా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











