#Prabhas21లో దీపిక రెమ్యునరేషన్‌పై వివాదం.. అన్నికోట్లు అవసరమా? పరమ వేస్ట్ అంటూ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారనే తొలిసారి అడుగుపెడుతున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేసింది. ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ జోడిగా నటిస్తున్నారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్యాన్ వరల్డ్ స్టేటస్ ఉన్న హీరోయిన్ అంటూ నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తే.. మరి కొందరు ఆమె ఎంపికపై పెదవి విరుస్తున్నారు. ఆమెకు చెల్లించే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీపికకు అంత మొత్తం చెల్లించడం శుద్ద దండగ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు దీపిక ఎన్ని కోట్లు చెల్లిస్తున్నారంటే..

బాలీవుడ్‌లో ప్రభాస్ హవా
బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రం సాహో హిందీలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకొని కనకవర్షం కురిపించింది. దాంతో ప్రభాస్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ విజయం చేరిపోయింది. ఈ క్రమంలో యంగ్ రెబల్‌స్టార్ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభాస్, దీపికా పదుకోన్ భారీ రెమ్యునరేషన్‌ను వైజయంతి మూవీస్ ముట్టజెప్పినట్టు సమాచారం.

హిందీ బిజినెస్‌లో వాటా
బాలీవుడ్‌లో దీపికా పదుకోన్ పద్మావతి చిత్రానికి సుమారుగా రూ.12 కోట్లకు తక్కువ కాకుండా పారితీషికం తీసుకొన్నట్టు సమాచారం. ఇక తాను నిర్మాతగా మారి తీసిన చపాక్ సినిమాకు దాదాపు రూ.15 కోట్ల రెమ్యునరేషన్‌ను తన ఖాతాలో వేసుకొన్నారనే టాక్ బాలీవుడ్‌లో వచ్చింది. అయితే నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమాకు పారితోషికంగా తీసుకోకుండా హిందీ బిజినెస్‌లో వాటా కావాలని డిమాండ్ చేసినట్టు సమాచారం.

దీపిక పదుకోన్‌కు 30 కోట్లా?
#Prabhas21కు హిందీలో హక్కులు భారీగానే అమ్ముడుపోతాయనే విషయం తెలిసిందే. ఒకవేళ భారీ రేంజ్‌లో బిజినెస్ జరిగితే దీపిక పదుకోన్‌కు రూ.30 కోట్ల నుంచి రూ.50 మధ్య పారితోషికం లభించవచ్చు అనే టాక్ వినిపిస్తున్నది. ఒకవేళ అదే నిజమైతే దీపిక పదుకోన్ రెమ్యునరేషన్ ఇండియాలోనే టాప్ అనేది ఖాయం కాబోతున్నది. పారితోషికం విషయంలో ప్రియాంకతో ఉన్న పోటీని సులభంగా అధిగమించే అవకాశం ఉందనే వాదన బాలీవుడ్‌లో వినిపిస్తున్నది.

ప్రభాస్‌కు 75 కోట్లకుపైనే అంటూ
ఇక ప్రభాస్ కూడా పారితోషికం తీసుకోవడం లేదనే మాట వినిపిస్తున్నది. ప్రభాస్ కూడా బిజినెస్‌లో షేర్ తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే నిజమైతే ప్రభాస్‌కు తన 21వ సినిమాలో నటిస్తే వచ్చే రెమ్యునరేషన్ కనీసం రూ.75 కోట్లు ఉండే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

దీపికకు అంత పారితోషికం దండగ
అయితే దీపికా పదుకోన్ అంత భారీగా 30 కోట్లు చెల్లించడం శుద్ద దండగ.. బాలీవుడ్‌లో ప్రేక్షకులను రాబట్టే సత్తా ఆమెకు లేదు. అంతా ఆమె పీఆర్ టీమ్ గిమ్మిక్కు. దాని బదులు ప్రభాస్21 యూనిట్ ఆ డబ్బును గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్, లొకేషన్లు, ఆర్ట్ విభాగం కోసం ఖర్చు పెట్టుకొంటే కరెక్ట్. దీపిక బదులు బాలీవుడ్‌లో మరో హీరోయిన్‌నో.. లేదా దక్షిణాదిలో మరో స్టార్ హీరోయిన్‌ను పెట్టుకొంటే డబ్బులు మిగులుతాయి అంటూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు రోహిత్ జైస్వాల్ ట్వీట్ చేశారు.
Recommended Video

రూ.400 కోట్ల బడ్జెట్‌తో
ప్రభాస్21 చిత్రాన్ని జానపద కథా నేపథ్యంగా ఓ ఫాంటసీగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాను అని ఆ మధ్య బహిరంగంగా ప్రకటన చేశారు. వైజయంతీ మూవీస్ స్థాపించి 50 ఏళ్లు అయినందున ఈ సినిమాను ఆ రేంజ్‌లో రూపొందించి వారికి కానుకగా అందించాలనే ప్రయత్నాల్లో నాగ్ అశ్విన్ ఉన్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిందేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











