#Prabhas21 మూవీకి దీపికా పదుకోన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇండియాలోనే టాప్‌గా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారనే వార్త సోషల్ మీడియాను కుదిపేసింది. ప్రభాస్ సరసన దీపిక నటిస్తున్నారనే వార్తతో ఫ్యాన్స్ సంబరపడి పోయారు. అలాగే ప్యాన్ ఇండియాకు సరిపడే హీరోయిన్ కాకుండా.. ప్యాన్ వరల్డ్ స్టేటస్ ఉన్న హీరోయిన్ అంటూ నెటిజన్లు ఆకాశానికి ఎత్తేశారు. అయితే తెలుగు సినిమా కోసం దీపికను ఒప్పించడానికి వైజయంతీ మూవీస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత అనే చర్చ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం దీపిక ఎంత తీసుకొన్నారు? దీపిక గురించి మరిన్నీ వివరాలు..
Recommended Video

తొలిసారి రజనీకాంత్‌తో
కన్నడ భామగా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన దీపిక చోప్రా దక్షిణాది సినిమాల్లో నటించిన దాఖలాలు చాలా తక్కువే. 2014లో తొలిసారి దక్షిణాది చిత్రం కొచ్చడయాన్ అనే చారిత్రాత్మక చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించారు. అయితే అది యానిమేషన్ ప్రాధానంగా రూపొందడం తెలిసిందే. దాదాపు 12 భాషల్లో రిలీజైన కచ్చడయాన్ దారుణమైన ఫ్లాప్‌ను ముటగట్టుకొన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి ప్రవేశం
గతంలో పలుమార్లు దీపికా పదుకోన్‌ను తెలుగులోకి రప్పించాలని చాలానే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఏదో కారణంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కానీ ఇప్పుడు తొలిసారి తెలుగులోకి ఓ చారిత్రక, జానపద చిత్రంగా రూపొందే చిత్రంతో అడుగుపెడుతున్నారు. దీంతో రెండోసారి దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

ఫ్లాప్ రికార్డుతో ఎంట్రీ
దక్షిణాదిలోనూ కచ్చడయాన్ ఫ్లాప్ రికార్డు, అలాగే హిందీలో తాజాగా ఆమె నిర్మాతగా వ్యవహరించి.. నటించిన చపాక్ చిత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలా ఫ్లాప్ రికార్డుతో లాక్‌డౌన్ తర్వాత సినిమాను మొదలుపెట్టబోతున్నది. అయినా తన రేంజ్‌కు రెండు మూడింతల రెట్లుగా రెమ్యునరేషన్‌ను వసూలు చేస్తున్నట్టు సమాచారం.

ప్రభాస్ రేంజ్‌కు తగినట్టే
ప్రభాస్ నటించిన సాహో చిత్రం దక్షిణాదిలో అంతగా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టలేకపోయింది. అయితే హిందీలో భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ప్రభాస్‌కు హిందీలో ఉన్న మార్కెట్‌ను సాహో మరోసారి రుజువు చేసింది. ఈ క్రమంలో ప్రభాస్ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకొని దీపికా పదుకోన్ చేసిన డిమాండ్‌కు సరేనంటూ వైజయంతి మూవీస్ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.

హిందీ హక్కుల్లో వాటాకు డిమాండ్
సాధారణంగా దీపికా పదుకోన్ తన సినిమాకు సుమారుగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటుందనే టాక్ బాలీవుడ్‌లో ఉంది. అయితే #Prabhas21కు మాత్రం తాను రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదట. అయితే తన రెమ్యునరేషన్‌లో భాగంగా హిందీలో హక్కుల్లో కొంత భాగాన్ని దీపిక పదుకోన్ అడిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే దీపికా రెమ్యునరేషన్ గతంలో కంటే మూడు రెట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్లలో మొదటిస్థానంలో ఉండే అవకాశం ఉంది.

ప్యాన్ వరల్డ్ అప్పీల్‌తో
అయితే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్.. జానపద కథా నేపథ్యంగా ఓ ఫాంటసీ సినిమాను ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వైజయంతీ మూవీస్ స్థాపించి 50 ఏళ్లు అయినందున ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుకు వెనుకాడకుండా సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిందేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











