ఫౌజీ భామకు ప్రభాస్ సర్రైజ్..మనసు నిండిపోయిందంటూ..
హీరో ప్రభాస్ (Prabhas) పేరు వినగానే కేవలం పాన్-ఇండియా స్టార్ అనే గౌరవమే కాదు, అతని సరళత, పెద్దమనసు, ఆతిథ్యం కూడా గుర్తుకొస్తాయి.ముఖ్యంగా ప్రభాస్ ఆతిథ్యానికి ఇండస్ట్రీలో ప్రత్యేకత ఉంది. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మీయత గురించి చెప్పక తప్పదు. తాజాగా ఆయనతో కలిసి నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ (Imanvi) కూడా ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించింది. సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇమాన్వీ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా 'ఫౌజీ (Fauzi)' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. షూటింగ్ మధ్యలో బ్రేక్ సమయంలో ప్రభాస్ స్వయంగా తన ఇంట్లో వండించిన భోజనాన్ని ఇమాన్వీకి పంపించాడు. ఆ భోజనం చూసి ఇమాన్వీ ఆశ్చర్యపోవడంతో పాటు ఆనందానికి లోనయ్యారు.

అనంతరం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేస్తూ " మీ ఆతిథ్యానికి నా మనస్సు, పొట్ట నిండుగా మారిపోయాయి. థ్యాంకూ ప్రభాస్ గారూ" అని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అభిమానులు ప్రభాస్ జెస్టర్‌కి మంత్ర ముగ్దులై "ఇదే ఆయన ప్రత్యేకత, స్టార్‌డమ్‌కి మించిన మనసు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
'ఫౌజీ' సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 1940ల యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న పీరియడ్ డ్రామా. ఇందులో యుద్ధం, ప్రేమ, మరచిపోయిన చరిత్ర అనే అంశాలను మేళవించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్‌తో పాటు ఇమాన్వీ, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో విడుదల కానుంది.
ఇక ఇమాన్వీ తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన వదంతులకు కూడా స్పందించారు. ఆమె పాకిస్తాన్ మిలిటరీతో సంబంధాలు ఉన్నాయని కొంతమంది ట్రోల్స్ ప్రచారం చేయగా, ఆ వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. "నా కుటుంబంలో ఎవరూ పాకిస్తాన్ మిలిటరీకి చెందిన వారు కాదు. ఇవన్నీ అబద్ధాలు. నేను లాస్ ఏంజెల్స్‌లో జన్మించిన ఇండియన్ అమెరికన్, హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. కళ ద్వారా ప్రజలను కలపడం నా లక్ష్యం" అని ఆమె స్పష్టం చేశారు.
ఈ వివాదాల మధ్య కూడా ఇమాన్వీ షూటింగ్‌పై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు.మొత్తానికి, ప్రభాస్ ఆతిథ్యానికి ఇమాన్వీ ఫిదా అవ్వడం, ఆమె చెప్పిన "హార్ట్ అండ్ స్టమక్ సో ఫుల్" కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్ తన మనసు ఎంత పెద్దదో మరోసారి నిరూపించాడు. షూటింగ్ సెట్‌లోనే అందరికీ హోం ఫుడ్ అందించడం ఆయన ప్రత్యేకతగా మారింది. 'ఫౌజీ' సెట్లో ప్రభాస్ చూపించిన ఆత్మీయత, వినయం మరోసారి ఆయనను "రియల్ స్టార్"గా నిలబెట్టాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడూతూ బిజీగా ఉన్నాడు.'రాజాసాబ్' (మారుతి దర్శకత్వం) రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కింది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' పీరియడ్ యాక్షన్ డ్రామా 2026 ఆగస్టులో విడుదల కానుంది. అలాగే 'స్పిరిట్' (సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం)లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అలాగే.. 'కల్కి 2' కూడా ప్రీ-ప్రొడక్షన్‌లో ఉంది. మొత్తానికి ప్రభాస్ లైన్‌లో ఉన్న సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు సృష్టిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











