బోల్డ్ రోల్స్ కి సై అంటున్న ప్రభాస్ బ్యూటీ.. ఓపెన్ గానే అలాంటి పాత్రలు ఓకే అంటుందిగా
సినీ పరిశ్రమలోకి వచ్చే వారు అంతా ఏదోకటి సాధిద్దామనే వస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒకో కల ఉంటుంది, మంచి నటుడుగా పేరు తెచ్చుకుందామని డబ్బులు సంపాదించుకుందామని ఇంకా మంచి పాత్రలు చేసి హీరోయిన్ గా సెటిల్ అవుదామని ఇలా సినిమాల్లో ఇండియా వైడ్ గా అనేకమంది నటీనటులు ఏజ్ తో సంబంధం లేకుండా వస్తూనే ఉంటారు. ఇదంతా ఎప్పుడూ జరిగే నిరంతర ప్రక్రియే కాగా..
దాదాపు ఫీమేల్ ఆర్టిస్ట్ లు అయితే తమ లోని నటిని ప్రూవ్ చేసుకోడానికి అన్నట్టుగా ఇండస్ట్రీస్ లోకి వస్తారు కానీ చాలా తక్కువ మందే తమ గ్లామర్ షోతో అలరించడానికి వస్తున్నామని బోల్డ్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధమే అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ని మాత్రం ఇవ్వరు. కానీ సరిగ్గా ఇదే తరహా స్టేట్మెంట్ ని కోలీవుడ్ డస్కీ అండ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇచ్చి షాకిచ్చింది.

గత కొన్ని రోజులు కితమే సోషల్ మీడియాలో ముచ్చటించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా మరోసారి నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. కాగా ఈ ఇంటరాక్షన్ లో ఒక ప్రశ్న ఈమెకి ఎదురైంది. జెనరల్ ఏ హీరో అయినా ఏ హీరోయిన్ కి అయినా ఒక డ్రీం రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా మాళవిక కెరీర్ పరంగా ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం ఎలాంటివి చేయడానికి ఇష్టపడతారు అనే కామెంట్ కి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది.
నేను బోల్డ్ పాత్రలు చేయడానికి సిద్ధమే అందులో సందేహం లేదు. ఎలాంటి రోల్స్ అయినా చేసి ఒక సూపర్ స్టార్ స్థాయికి ఎదగాలి అనేది నా థ్యేయం అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. దీనితో ఓపెన్ గానే తనకి బోల్డ్ సినిమాలు ఆఫర్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఫిలిం మేకర్స్ కి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది అని చెప్పాలి.

ఇప్పటికే మాళవిక సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు మంచి హీట్ ని రైజ్ చేస్తుంది. మరి ఇది కేవలం ఫొటోస్ వరకు మాత్రమే కాదు సినిమాల వరకు కూడా చేస్తాను అన్నట్టు ఇప్పుడు ఓపెన్ అయ్యింది, మరి చూడాలి ఈమె లోని గ్లామర్ యాంగిల్ ని ఏ దర్శకుడు చూపిస్తాడు అనేది. ఇంట్రెస్టింగ్ గా మాళవిక ఎన్ని స్కిన్ షో ఫోటో షూట్ లు చేసినప్పటికీ సినిమాల్లో ఇప్పటివరకు ఆ తరహా రోల్స్ రాలేదు.
ప్రస్తుతం ప్రభాస్ తో భారీ సినిమా "ది రాజా సాబ్" చేస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఇందులో ఏమన్నా ఈమె నుంచి అలాంటి ట్రీట్ ఉంటుందా ఏమో అనేది చూడాలి. కాగా ఇది కాకుండా ఈమె నటించిన తాజా చిత్రం "తంగళాన్" విక్రమ్ హీరోగా నటించిన సినిమా ఆగష్టు 5 రిలీజ్ కి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈమె బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











