‘పెళ్లి ఇష్టం లేదు.. కానీ, అది లేకుంటే కష్టమే'
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి (Pragathi) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నది. ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్, జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్‌తో యువతకే షాక్ ఇస్తున్నారు. ఇటీవల నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. ఈ రూమర్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ప్రగతి ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రగతి సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లిన ఆమెకు తమిళ నటుడు భాగ్యరాజ్ అవకాశం కల్పించారు. ఆయన తెరకెక్కించిన 'వీట్ల విశేషాంగ' సినిమా ద్వారా ప్రగతి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే ప్రగతి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత చాలా మంది నటీమణుల్లాగే ఆమె కూడా దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం తిరిగి నటనపై ఆసక్తితో రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటిస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు.

అయితే.. వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ప్రగతి ఎక్కడా రాజీ పడడం లేదు. గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేయడమే కాదు, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఇంటర్నేషన్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని స్విలర్ సాధించారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ప్రగతికి వైవాహిక జీవితం అంత సాఫీగా సాగలేదని ఆమె గతంలోనే వెల్లడించారు. భర్త ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు తీసుకుని, కొడుకు,కుమార్తెతో బయటకు వచ్చారని తెలిపారు. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం తన జీవితంలో తీసుకున్న పెద్ద పొరపాటని కూడా ప్రగతి పలుమార్లు చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే.. నటి ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జీవితంలో ఒక తోడు అవసరమే. కానీ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి. నా మెచ్యూరిటీ లెవల్‌కు సరిపడే వ్యక్తి దొరకకపోతే మళ్లీ అదే కష్టమే' అని అన్నారు. అలాగే, 'పెళ్లయ్యాక నువ్వు ఇలా ఉండాలి, అలా చేయాలి అంటూ కట్టుబాట్లు పెడితే నేను భరించలేను. ఒకవేళ నేను 20 ఏళ్లు ఉంటే.. సర్దుబాటు అయ్యేదాన్ని, కానీ, ఇప్పుడు నా వయసు, నా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. పెళ్లిపై ప్రస్తుతం ఎలాంటి ఆశలు లేవు'అని స్పష్టంగా చెప్పారు.
ఇక తన పిల్లల గురించి చెబుతూ.. ' కొడుకు ఇప్పుడిప్పుడే వాటి ప్రపంచంలో వాడు బిజీబిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసుకుని బెంగుళూర్ లో పని చేస్తున్నాడు. కూతురు యూఎస్ లో చదువుకుంటుంది. నేను నా పిల్లలతో చాలా క్లోజ్ గా ఉంటా.. ఫ్రెండ్ లా చూసుకుంటా.. సొసైటీకి మాత్రం మంచి పిల్లలను ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. ఆ విషయంలో నేను గర్వంగా ఫీలవుతాను. మంచి పిల్లలు'అని అన్నారు. ప్రస్తుతం ప్రగతి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











