ఇలా నేనెప్పుడూ ట్రై చేయలేదు.. ఆనందంలో మునిగిన హీరోయిన్
కంచె చిత్రంలో మంచి నటనను కనబరిచి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్టు, బొట్టు చూసి అచ్చ తెలుగమ్మాయనిపించే ప్రగ్యా జైస్వాల్.. తెలుగులో అంతగా పాపులర్ కాలేకపోయింది. అందం, ప్రతిభ ఉన్నా.. ఈ భామకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.
వరుస పరాజయాలలతో..
కంచె తనకు మంచి పేరే తీసుకొచ్చినా.. తరువాత చేసిన ఏ చిత్రం కూడా కలిసి రాలేదు. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక చిత్రాలు తనకేమాత్రం ఉపయోగపడలేదు. చివరగా వచ్చిన జయ జానకీ నాయక చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసినప్పటికీ ప్రగ్యాకు ప్రయోజనం లేకుండా పోయింది. అందులో సెకండ్ హీరోయిన్‌గా కొన్ని సీన్లకే పరిమితం కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇక అప్పటి నుంచి ప్రగ్యా తెలుగులో కనిపించడమే మానేసింది.

తాజాగా ఈఫిల్ టవర్ దగ్గర ప్రత్యక్షం..
ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోన్న ఈ భామ ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను సందర్శించడానికి వెళ్లింది. అయితే ఇలాంటి వ్యూను నేనెప్పుడూ ట్రై చేయలేదంటూ తన ఆనందాన్ని పంచుకుంది. బంగారు వర్ణ కాంతులతో నిండి ఉన్న ఈఫిల్ టవర్‌ను చూస్తూ ఆనందిస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











