ప్రగ్యా జైస్వాల్ కోరికలు మామూలుగా లేవు.. బికినీతో సముద్రంలో అలా రచ్చ!!
ఇంత కాలం అందరూ లాక్ డౌన్ వల్ల ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. షూటింగ్‌లంటూ రోజూ దేశవిదేశాలు తిరిగే సెలెబ్రిటీస్‌కు ఇలా ఏకందా ఆరేడు నెలలు ఇంటిపట్టునే ఉండాల్సి రావడంతో పిచ్చెక్కిపోయింటుంది. అయితే ఈ మధ్యే ఒక్కొక్కరు మెల్లిగా బయటకు వస్తున్నారు. కొందరు భామలు షూటింగ్‌లో సందడి చేస్తూ ఉంటే ఇంకొందరు వెకేషన్స్ అంటూ ఇన్నాళ్లు మిస్ అయిన సంతోషాన్ని వెతుక్కుంటున్నారు.

ప్రగ్యా సందడి...
కంచె సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యాకు ఆపై సరైన సక్సెస్ రాలేదు. ఓం నమో వెంకటేశాయలో అతిథి పాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా ఏ ఒక్కటి స్టార్డంను తీసుకురాలేకపోయాయి. అయితే సినీ కెరీర్ ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూ ఉంటుంది.

హాట్ హాట్ ఫోటోలతో..
కొందరు భామలు సోషల్ మీడియా ద్వారానే ఫేమస్ అవుతుంటారు. సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా వాటితో ఎలాంటి సంబంధం లేకుండా కొందరి క్రేజ్ అలా పెరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటారు.ప్రగ్యా కూడా అంతే హీటెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను కట్టిపడేస్తూ ఉంటుంది.

తాజాగా అలా..
తాజాగా వీకెండ్ వచ్చింది అంటూ ప్రగ్యా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఓ కామెంట్ చేసింది. నో ప్లాన్స్, నో ప్రాబ్లమ్స్ అంటూ క్వారంటైన్‌లో అలా గడిచిపోతోందని చెప్పుకొచ్చింది. ఉదయాన్నే జాగింగ్‌కు వెళ్తున్నట్టు రెడీ అయిన ఫోటోలు షేర్ చేయడంతో అవి బాగానే వైరల్ అయ్యాయి.

టేక్ మీ బ్యాక్..
రీసెంట్‌గా ప్రగ్యా జైస్వాల్ ఓ పాత ఫోటోను షేర్ చేసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం నా మదిలో ఇలాంటి కోరికలే ఉన్నాయి.. మళ్లీ నన్ను వెనక్కి తీసుకెళ్లండి బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేయాలని ఉందంటూ పరోక్షంగా చెప్పేసింది.


Click it and Unblock the Notifications











